STOCKS

News


అనిల్ అంబానీని జైలుకు పంపండి!!

Saturday 5th January 2019
news_main1546685027.png-23429

  • విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలివ్వండి
  • మా బాకీల చెల్లింపులో మళ్లీ మళ్లీ డిఫాల్టవుతున్నారు
  • సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎరిక్‌సన్‌

న్యూఢిల్లీ: దాదాపు 550 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) చీఫ్ అనిల్ అంబానీపై స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న ఆయన్ను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఒక ఆంగ్ల ఫైనాన్షియల్ డెయిలీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆర్‌కామ్ జరపాల్సిన చెల్లింపులకు సంబంధించి అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో దీని ఆధారంగానే ఎరిక్సన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, స్పెక్ట్రం విక్రయాన్ని జాప్యం చేయడంపై టెలికం శాఖపై (డాట్‌) ఆర్‌కామ్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. స్పెక్ట్రం విక్రయంలో డాట్ జాప్యం చేయకుండా ఉండి ఉంటే ఎరికన్స్, ఇతర రుణదాతల బకాయిలు తీర్చేసేందుకు ఉపయోగకరంగా ఉండేదని పేర్కొంది. ఈ రెండు పిటీషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. "ఆర్‌కామ్‌తో పాటు తత్సంబంధిత వర్గాలు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో తాజాగా మరో పిటీషన్ వేయాల్సి వచ్చింది. మేం చాలా కాలంగా బాకీల చెల్లింపు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ వారు చెల్లించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. కోర్టు ఆదేశాల ధిక్కరణ రుజువైన పక్షంలో ఆరు నెలల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది" అని ఎరిక్సన్ తరఫు న్యాయవాది అనిల్ ఖేర్ తెలిపారు.
స్పెక్ట్రం విక్రయంపై ఆర్‌కామ్ ఆశలు..
ఎరిక్సన్‌కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించడంలో ఆర్‌కామ్ విఫలం కావడం ఇది రెండోసారి. తొలిసారి డిఫాల్ట్ అయిన తర్వాత ఆర్‌కామ్‌కు సుప్రీం కోర్టు మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోగా ఏటా 12 శాతం వడ్డీ రేటుతో బాకీలు చెల్లించాలని ఆదేశించింది. కానీ ఆర్‌కామ్ రెండో సారి కూడా విఫలమైంది. మరో టెలికం సంస్థ రిలయన్స్ జియోకు వైర్‌లెస్ స్పెక్ట్రంను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణదాతలకు బకాయిలు చెల్లించేయాలని ఆర్‌కామ్ ఆశిస్తోంది. అయితే, ఆర్‌కామ్ బాకీలకు బాధ్యత వహించడానికి జియో సిద్ధంగా లేనందున కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పెక్ట్రం డీల్‌కు అనుమతించలేమంటూ డిసెంబర్‌ నెలలో టెలికం శాఖ తోసిపుచ్చింది. ఈ పరిణామాల దరిమిలా ఆర్‌కామ్‌, ఎరిక్సన్‌ వివాదం మరోమారు కోర్టుకెక్కింది.



You may be interested

రీడ్‌ అండ్‌ టేలర్‌ లిక్విడేషన్‌ నిలిపివేత

Saturday 5th January 2019

ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్‌ అండ్‌ టేలర్‌ కంపెనీ లిక్విడేషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నిలిపేసింది. రీడ్‌ అండ్‌ టేలర్‌ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి  విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ

నిల్చిన రూ. 2వేల నోట్ల ముద్రణ

Saturday 5th January 2019

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ అనంతరం ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్ల ముద్రణను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది. అవసరాలకు అనుగుణంగానే నోట్ల ముద్రణ ఉంటుందని, ప్రస్తుతానికి తగినంత స్థాయిలో రూ.2,000 నోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు. "ప్రస్తుతం వ్యవస్థలో రూ.2,000 నోట్లు అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం నోట్ల విలువలో ఇవి 35 శాతంగా ఉంటాయి. రూ. 2,000 నోట్ల

Most from this category