STOCKS

News


పర్యావరణానికి రూ.3,111 కోట్లు

Saturday 2nd February 2019
news_main1549110716.png-23985

న్యూఢిల్లీ: పర్యావరణ మంత్రిత్వ శాఖకు మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ప్రాజెక్టు టైగర్‌కు రూ.350 కోట్లు, ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ)కి రూ.100 కోట్లు, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువ అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ గ్రీన్‌ ఇండియాకు రూ.240 కోట్లు కేటాయించింది. అయితే, కాలుష్యాన్ని తగ్గించే కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది.



You may be interested

ఆరోగ్యం..ఆయుష్మాన్‌!

Saturday 2nd February 2019

గతేడాది కన్నా 16 శాతం అధిక కేటాయింపులు మొత్తం రూ.61,398 కోట్లు..అందులో ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.6400 కోట్లు 2022 నాటికి 1.5 లక్షల వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు ఎయిమ్స్‌లకు రూ.3599.65 కోట్లు..ఎన్‌హెచ్‌ఎంకు రూ.రూ.31,745 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6400 కోట్లను ఆయుష్మాన్‌ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్‌ భారత్‌కు)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా

ఇది చారిత్రాత్మక బడ్జెట్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ చారిత్రాత్మకమని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. స్వవలంబన, ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చెందిన ‘నవ భారత్‌’ఏర్పాటు ప్రక్రియను ఈ బడ్జెట్‌ వేగవంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. ‘ఈ చారిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి గోయల్‌ను అభినందిస్తున్నా. ఈ బడ్జెట్‌లో కేవలం అభివృద్ధి గురించే కాకుండా సమాజంలోని మధ్యతరగతి ప్రజలు, రైతులు, అసంఘటిత రంగంలోని

Most from this category