STOCKS

News


పీఎస్‌బీలపై ద్వంద నియంత్రణ తొలగిపోవాలి: వైవీ రెడ్డి

Friday 24th August 2018
news_main1535089876.png-19592

కోల్‌కతా: ప్రభుత్వరంగ బ్యాంకులపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ రెండు విధాల నియంత్రణలన్నవి ఉండకూడదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అన్నారు. బంధన్‌బ్యాంకు మూడో వార్షికోత్సవం సందర్భంగా గురువారం కోల్‌కతాలో నిర్వహించిన సమావేశంలో రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వరంగ బ్యాంకులపై అన్ని నియంత్రణ అధికారాలు ప్రస్తుతం ఆర్‌బీఐకి లేవన్నారు. నరసింహన్‌ కమిటీ 25 ఏళ్ల క్రితమే ఈ అంశాన్ని ప్రస్తావించడంతోపాటు ద్వంద నియంత్రణకు ముగింపు పలకాలని సూచించినట్టు తెలపారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఈ రెండింటిలో ఒకరికే నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. డిపాజిటర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్‌ చేయడంపై మాట్లాడుతూ... అధిక మధ్యవర్తిత్వ వ్యయం కారణంగా రాబడులు ఆశాజనకంగా లేవంటూ, ఇది తగ్గుముఖం పట్టాల్సిన అవసరం ఉందన్నారు. 



You may be interested

భారత్‌కు 4 పెద్ద బ్యాంకులు కావాలి

Friday 24th August 2018

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి గల బ్యాంకులు కనీసం 3-4 అయినా భారత్‌కు అవసరమని నీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. దేశీ బ్యాంకింగ్ రంగం రిస్కు సామర్ధ్యం చాలా తక్కువేని, ప్రాజెక్టుల మదింపు సామర్ధ్యం ఉండాల్సినంత స్థాయిలో లేదని కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు.. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా సంస్థలకు

పీఎన్‌బీ ఉద్యోగులకు 10 కోట్ల షేర్లు

Friday 24th August 2018

న్యూఢిల్లీ: దీర్ఘకాలిక వనరులను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. తమ ఉద్యోగులకు కొత్తగా 10 కోట్ల షేర్లను కేటాయించాలని యోచిస్తోంది. ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ఈఎస్‌పీఎస్‌) కింద వీటిని కేటాయించే ప్రతిపాదనకు సెప్టెంబర్ 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి తీసుకోనుంది. బ్యాంకులో కేంద్రం వాటా 52 శాతానికి తగ్గని విధంగా కొత్తగా 10 కోట్ల షేర్లను

Most from this category