STOCKS

News


అపరాధ భావన తొలిచేస్తోంది..

Friday 10th August 2018
news_main1533897483.png-19140

ముంబై: షేరు పతనం కారణంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుండటంపై జెట్‌ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తనకు 'సంకటంగా మారిందని, అపరాధ భావన' కలిగిస్తోందని  ఆయన వ్యాఖ్యానించారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా మంది షేర్‌హోల్డర్లు నష్టపోయారు. ఏదో అపరాధం చేసిన భావన తొలిచేస్తోంది. ఈ పరిస్థితి ఇబ్బందికరంగాను .. సంకటంగాను ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 5న 52 వారాల గరిష్ట స్థాయి రూ. 883.65 వద్ద ట్రేడయిన జెట్ ఎయిర్‌వేస్ షేరు ఏకంగా 67.5 శాతం పతనమైంది. గురువారం ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ. 286.10 వద్దకు పడిపోయింది. ఈ నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు పోటీ తీవ్రతరమైందని, మరోవైపు ఇంధన ధరలు పెరుగుతుండటం కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గోయల్ చెప్పారు. సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడం, ఉద్యోగుల జీతాల్లో కోత ప్రతిపాదనలు వంటి అంశాలపై స్పందిస్తూ.. కంపెనీపై ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రత్యేకంగా కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు గోయల్ తెలిపారు. ఈ కమిటీ సమావేశాలకు జెట్ ఎయిర్‌వేస్ డైరెక్టర్లయిన నసీమ్ జైదీ, అశోక్ చావ్లా సారథ్యం వహిస్తారని ఆయన చెప్పారు. అటు ఇంజినీరింగ్, ఫ్లయిట్స్ కార్యకలాపాల్లో సహకారం కోసం ప్రభుత్వ రంగ ఎయిరిండియాతో చర్చలు జరుపుతున్నట్లు గోయల్ వివరించారు. 



You may be interested

ట్రాయ్ చైర్మన్‌గా శర్మ కొనసాగింపు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఆధార్ నంబరు చాలెంజ్‌తో వివాదాస్పదమైన టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 సెప్టెంబర్ 30 దాకా మరో రెండేళ్ల పాటు ట్రాయ్ చైర్మన్‌గా ఆయన్ను కొనసాగించే ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. 2015 జూలైలో మూడేళ్ల కాలానికి ఆయన ట్రాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1982 బ్యాచ్ జార్ఖండ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి

భారత్‌ వృద్ధి బాట పటిష్టం!

Friday 10th August 2018

న్యూయార్క్‌: భారత్‌ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 2018-2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019-2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే... ♦ సమీప భవిష్యత్‌తో భారత్‌ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్‌ బాగుంది.  ♦ ద్రవ్యోల్బణం 2018-19లో 5.2 శాతంగా

Most from this category