STOCKS

News


ఐపీఓకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌

Saturday 13th October 2018
news_main1539410318.png-21118

ముంబై:- ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సెబి సమర్పించింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర కంపెనీ మొత్తం రూ.1000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లు తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రస్తుత ప్రమోటర్లతో పాటు, షేర్‌ హోల్డర్లు సైతం అంతే విలువ కలిగిన ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు. ఈ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, నోమురా ఫైనాన్స్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ కంపెనీలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. సమీకరించిన నిధులను సాదారణ కార్పోరేషన్‌ ప్రయోజనాలకు, రుణ భారాన్ని  తగ్గించుకునేందుకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇష్యూ ప్రక్రియ పూర్తి చేసుకున్న పిమ్మట షేర్లను బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రెండేళ్ల కిందట స్థాపించబడిన ఇమామి సిమెంట్‌ కంపెనీ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 5.60 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. ప్రస్తుత కంపెనీ మూడు ఉత్పాదక యూనిట్లను కలిగింది.



You may be interested

షేర్ల బైబ్యాక్‌కు నాల్కో బోర్డ్‌ ఆమోదం

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా షేర్లను బైబ్యాక్‌ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం

ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6.88% అప్‌

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6.88 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సర ఏప్రిల్‌–సెప్టెంబరు కాలానికి 17,44,305 యూనిట్లు అమ్ముడవగా.. గతేడాది ఈ కాలంలో 16,32,006 యూనిట్లు అమ్ముడయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ పెరగడం, నూతన వాహనాల విడుదల కారణంగా 6.88 శాతం వృద్ధి

Most from this category