STOCKS

News


ఐషర్‌ మోటార్స్‌ లాభం రూ.576 కోట్లు

Friday 10th August 2018
news_main1533896869.png-19133

న్యూఢిల్లీ: ఐషర్‌ మోటార్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.576 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.460 కోట్లతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.2,255 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.2,548 కోట్లకు పెరిగింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల అమ్మకాలు 22 శాతం వృద్ధితో 2.25 లక్షలకు చేరుకున్నాయి. ఈ బైక్‌ల ఎగుమతులు 10 శాతం పెరిగి 5,636కు చేరాయి. వీఈ కమర్షియల్‌ వెహికల్స్‌ బ్రాండ్‌ కింద విక్రయించే ట్రక్కులు, బస్సుల అమ్మకాలు 41 శాతం వృద్ధితో 16,327కు పెరిగాయి. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐషర్‌ మోటార్స్‌ షేర్‌ ఫ్లాట్‌గా రూ.27,484 వద్ద ముగిసింది.



You may be interested

ఆన్‌లైన్‌ కిరాణాపై ఫ్లిప్‌కార్ట్‌ దృష్టి

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి కిరాణా సరుకుల మార్కెట్‌పై దృష్టిసారించింది. ‘నియర్‌బై’ పేరుతో అక్టోబరు 2015లో ఈ-గ్రోసరీ యాప్‌ను ప్రారంభించి కొన్ని నెలల కాలంలోనే ఈ వ్యాపారాన్ని మూసివేసిన ఈ ఆన్‌లైన్‌ సంస్థ.. అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌ వంటి బడా సంస్థలకు పోటీనివ్వడం కోసం మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరులో ఆన్‌లైన్‌ కిరాణాపై పట్టు సాధించిన ఫ్లిప్‌కార్ట్‌, ఈ విభాగంలో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది.

4 శాతం తగ్గిన ఫ్యూచర్‌ రిటైల్‌ లాభం

Friday 10th August 2018

 న్యూఢిల్లీ: బిగ్‌బజార్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌లను నిర్వహించే ఫ్యూచర్‌ రిటైల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.153 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.148 కోట్లతో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఫ్యూచర్‌ రిటైల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,707 కోట్ల నుంచి రూ.4,542 కోట్లకు తగ్గిందని పేర్కొంది. గత ఏడాది జూలై నుంచి

Most from this category