STOCKS

News


ఈఈఎస్‌ఎల్ నుంచి ఏసీలు

Tuesday 9th July 2019
news_main1562651718.png-26917

  • 1.5 టన్నుల ఇన్వర్టరు ఏసీ రేటు రూ. 41,300
  • తొలి దశలో ఢిల్లీలో 50వేల యూనిట్ల విక్రయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్‌) తాజాగా ఎయిర్‌కండీషనర్స్‌ విక్రయం ప్రారంభించింది. 1.5 టన్నుల సామర్థ్యమున్న ఇన్వర్టర్‌ ఏసీ ధర రూ. 41,300గా ఉంటుందని కంపెనీ ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. కేంద్ర విద్యుత్‌ శాఖలో భాగమైన నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు జాయింట్‌ వెంచర్‌ సంస్థగా ఈఈఎస్‌ఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నివాస గృహాలు, వ్యాపార సంస్థల కోసం విద్యుత్ ఆదా చేసే ఏసీల విక్రయం కోసం 2019 ఫిబ్రవరిలో ప్రత్యేక పథకాన్ని ఈఈఎస్‌ఎల్ ఆవిష్కరించింది. తాజాగా తొలి దశలో ఢిల్లీలోని బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ (బీఆర్‌పీఎల్‌), బీఎస్‌ఈఎస్‌ యమున పవర్ (బీవైపీఎల్‌), టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ (టాటా పవర్ డీడీఎల్‌) వినియోగదారులకు 50,000 ఏసీలు అందుబాటులో ఉంచుతున్నట్లు, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు సౌరభ్ కుమార్‌ చెప్పారు. ఈఈఎస్‌ఎల్ మార్ట్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాల్సి ఉంటుందని వివరించారు. జీఎస్‌టీ, రవాణా వ్యయాలతో కలిపి ఏసీ రేటు రూ. 41,300గా ఉంటుందని చెప్పారు. దేశీయంగా 5.4 స్టార్ రేటింగ్‌తో అందిస్తున్న ఏకైక స్ప్లిట్ ఏసీ ఇదేనన్నారు. 5 స్టార్ రేటింగ్‌తో దాదాపు రూ. 50,000 పైగా పలికే ఇతరత్రా బ్రాండ్స్‌తో పోలిస్తే ఈ ఏసీ ఏటా సుమారు 300 యూనిట్స్ మేర విద్యుత్ ఆదా చేస్తుందన్నారు. దీని తయారీకి మూడు ఎలక్ట్రానిక్‌ గృహోపకరణ సంస్థలు పోటీపడగా.. వోల్టాస్ అత్యంత చౌకగా బిడ్‌ చేయడం ద్వారా కాంట్రాక్టు దక్కించుకుంది. దైకిన్ అత్యధికంగా రూ. 46,000 కోట్ చేసింది.



You may be interested

హీరో వాహనాలు మరింత ప్రియం

Tuesday 9th July 2019

 ఒక శాతం వరకు ధరల పెంపు న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల ధరలను ఒక శాతం వరకు పెంచినట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల మోడల్‌ ఆధారంగా ఒక శాతం వరకు పెంపు అమల్లోకి వచ్చినట్లు ప్రకటించిన సంస్థ.. ఏ మోడల్‌కు ఎంత పెంపు ఉందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. 

ఈ ఏడాది ఫార్మా వృద్ధి 11-13 శాతం

Tuesday 9th July 2019

ఈ ఏడాది ఫార్మా వృద్ధి 11-13 శాతం దేశీయంగా 9-10 శాతం గ్రోత్‌ ఇక్రా నివేదికలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 11-13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో ఆర్యోగకర డిమాండ్‌ ఇందుకు కారణమని వివరించింది. అలాగే యూఎస్‌ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నూతన ఉత్పత్తుల విడుదల, ఇప్పటికే విక్రయిస్తున్న మందుల విషయంలో కంపెనీల వాటా పెరగడం వంటి

Most from this category