STOCKS

News


ఇక ఈడీలూ ఎస్‌బీఐ ఎండీలు కావచ్చు!

Tuesday 18th December 2018
news_main1545110304.png-23034

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నియామకాలకు సంబంధించి కేంద్రం సోమవారం కీలక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం- జాతీయ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లనూ (ఈడీ) ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా ఎంపిక చేయవచ్చు. ఇప్పటి వరకూ ఎస్‌బీఐ ఎండీ కావాలంటే, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లకు (డీఎండీ) మాత్రమే అవకాశం ఉండేది. సంప్రదాయకంగా వస్తున్న విధానాన్ని పక్కనబెట్టి, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లు (డీఎండీ) పలువురిని కేంద్రం ఈ ఏడాది మొదట్లో పలు జాతీయ బ్యాంకుల ఎండీలుగా నియమించింది. ‘‘ఇకపై జాతీయ బ్యాంకుల ఈడీలకూ ఎస్‌బీఐ ఎండీలుగా నియమితులయ్యే అవకాశం ఏర్పడింది’’ అని ఆర్థికశాఖ తాజాగా ప్రకటన తెలిపింది.  ప్రస్తుతం చైర్మన్‌ నేతృత్వంలో ఎస్‌బీఐలో నలుగురు ఎండీలు తమ బాధ్యతలను నిర్వహిస్తారు.



You may be interested

ఆధార్ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఓకే..

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఆధార్ ఆధారంగా కొత్త మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్‌ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు.

విదేశీ శాఖలను మూసేయనున్న బీఓబీ

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వచ్చే ఏడాది జూన్‌ నాటికి మూడు విదేశీ బ్రాంచ్‌లను మూసేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విదేశీ శాఖల హేతుబద్ధీకరణ, సామర్థ్య పెంపు, లాభదాయకతల దృష్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. బ్యాంక్‌ ఏకీకృత వ్యాపారంలో ఒక శాతానికి తక్కువగా లాభాలను అందిస్తున్న గుయానా (దక్షిణ అమెరికా), ట్రినిడాడ్ అండ్‌

Most from this category