STOCKS

News


సెకురా ఎనర్జీకి ఎస్సెల్‌ గ్రూపు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు

Wednesday 17th October 2018
news_main1539750714.png-21231

ముంబై: ఎడెల్వీజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధ్వర్యంలోని సెకురా ఎనర్జీ, ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన నాలుగు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులను రూ.6,000 కోట్లతో సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో రెండు నిర్వహణలోని ప్రాజెక్టులు కాగా, రెండు నిర్మాణంలో ఉన్నవి. కార్యకలాపాలు నిర్వహించే వాటిలో దర్భంగా-మోతిహరి ట్రాన్స్‌మిషన్‌, ఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ XXXI (B) ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న రెండు ప్రాజెక్టులు 2020 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలు ఆరంభించనున్నాయి. సెకురా ఎనర్జీని ఎడెల్వీజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈల్డ్‌ప్లస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినది. ప్రధానంగా విద్యుత్‌ ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంది. 



You may be interested

5,999లకు ఆకర్షణీయమైన ఫోన్‌

Wednesday 17th October 2018

ప్రముఖ మొబైల్‌హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘ఏ5’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులోని ప్రత్యేకలను గమనిస్తే.. ♦ 5.45 అంగుళాల హెచ్‌డీ ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ♦ 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ♦ 13 ఎంపీ రియర్‌ కెమెరా ♦ 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ♦ ట్రిపుల్‌ స్లాట్‌ ♦ మీడియాటెక్‌ ఎంటీ 6739 క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ ♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌ ♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ♦ ధర: 2 జీబీ ర్యామ్‌+ 16 జీబీ మెమరీ వేరియంట్‌- రూ.5,999     3 జీబీ ర్యామ్‌+ 32.....

ఫుడ్‌పాండా చేతికి హోలాషెఫ్‌

Wednesday 17th October 2018

 హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ కంపెనీ ఫుడ్‌పాండా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్‌టెక్‌ కంపెనీ హోలాషెఫ్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫుడ్‌పాండా సొంత క్లౌడ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కేటగిరీల్లో సొంత బ్రాండ్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగుమమైందని ఫుడ్‌పాండా ఇండియా సీఈఓ ప్రణయ్‌ జీవ్‌రాజ్కా తెలిపారు. హోలాషెఫ్‌ కొనుగోలుతో కస్టమర్ల ఆహార అభిరుచులు, ఇష్టాలు తెలుస్తాయని... దీంతో సొంత బ్రాండ్‌కు అవకాశముంటుందని ఆయన ఒక

Most from this category