STOCKS

News


చందా కొచర్‌కు ఈడీ సమన్లు

Saturday 8th June 2019
news_main1559978254.png-26173

  • జూన్ 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్‌ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో కొచ్చర్‌ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది. 2009-2011 మధ్య కాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో చందా కొచర్‌ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన మేలుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌.. చందా కొచర్‌ భర్తకు చెందిన న్యూపవర్ రెన్యూవబల్స్‌లోకి కొంత పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూప్ తీసుకున్న రుణాలు మొండిబాకీలుగా మారడం గమనార్హం. మొత్తం మీద ఇదంతా చందా కొచర్‌ కుటుంబం, వేణుగోపాల్‌ ధూత్‌లకు లబ్ధి చేకూర్చేలా క్విడ్ ‍ప్రో కో వ్యవహారంగా జరిగిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 



You may be interested

ఏడు రోజుల్లో చెల్లింపులు: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Saturday 8th June 2019

అన్ని చర్యలు తీసుకుంటామన్న కంపెనీ  నిధుల సమస్యకు నిదర్శనం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: ఫిచ్‌ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై మరింత ఒత్తిడి: యూటీఐ ఎమ్‌ఎఫ్‌ న్యూఢిల్లీ: నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)పై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ, ఏడు రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో అన్ని చెల్లింపులు సకాలంలో పూర్తి చేస్తామని, భవిష్యత్తుల్లో చెల్లింపుల్లో విఫలం కాబోమని పేర్కొంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేసిన నాన్‌ కన్వర్టబుల్‌  డిబెంచర్లు(ఎన్‌సీడీ)కు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అంగీకరించింది. అయితే

రెపో రేటుతో వడ్డీ రేట్ల అనుసంధానం

Saturday 8th June 2019

జులై నుంచి అమలు చేయనున్న ఎస్‌బీఐ     ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జూలై నుంచి గృహ రుణాలు, స్వల్ప కాలిక రుణాలు, భారీ పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన మీదట.. రూ. 1 లక్ష పైగా పరిమితులు ఉన్న క్యాష్ క్రెడిట్ అకౌంట్‌,

Most from this category