STOCKS

News


నీరవ్‌ 173 పెయింటింగ్స్‌, 11 వాహనాలు వేలం!

Thursday 21st March 2019
news_main1553161689.png-24729

న్యూఢిల్లీ: కోట్లాదిరూపాయల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి, దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారికి చెందిన 173 విలువైన పెయింటింగ్స్‌, 11 వాహనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ)లు వేలం వేయనున్నాయి. నీరవ్‌ మోదీ, ఆయన షెల్‌ కంపెనీ-క్యాపెలాట్‌ పెయింటింగ్స్‌కు బెనిఫీషిల్‌ యజమానులు. ముంబైలోని ప్రత్యేక కోర్టు పెయింటింగ్స్‌, వాహనాల వేలానికి అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపారు. వేలం వేయనున్న పెయింటింగ్స్‌ విలువ రూ.57.72 కోట్లుకాగా, వేలం వేసే వాహనాల్లో రోల్స్‌ రాయీస్‌, పోర్చే, మెర్సిడెజ్‌, టొయోటా ఫార్చ్యూన్‌ వంటి అత్యాధునిక మోడల్స్‌ ఉన్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల ప్రకారం... తనకురావల్సిన రూ.95.91 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఐటీ శాఖ 68 పెయింటింగ్స్‌ను వేలం వేస్తుండగా, మిగిలిన వాటిని (పీఎంఎల్‌ఏ కింద ఇప్పటికే  ఈడీ జప్పు పరిధిలోఉన్నవి) ఈడీ వేలం వేస్తుందని ఉన్నత అధికారులు వెల్లడించారు. ఈ నెలాంతంలో వేలం జరిగే అవకాశం ఉంది. వచ్చిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమవుతుంది. 
నీరవ్‌ భార్యకూ నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌
దాదాపు రూ.13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో నీరవ్‌మోదీ భార్య ఆమీ ప్రమేయంపై ఇటీవల ఈడీ ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో, ఆమెకు పీఎంఎల్‌ఏ (అక్రమ ధనార్జనా నిరోధక చట్టం) కోర్టు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 

 



You may be interested

వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

Thursday 21st March 2019

-బుధవారం ముగింపు ధర కంటే 62 శాతం తక్కువ  -రైట్స్‌ ఇష్యూ రికార్డ్‌ డేట్‌ ఏప్రిల్‌ 2 -ఏప్రిల్‌ 10-24 మధ్య రైట్స్‌ ఇష్యూ  -ప్రతి 38 షేర్లకు 87 రైట్స్‌ షేర్లు  న్యూఢిల్లీ:- వొడాఫోన్‌ ఐడియా కంపెనీ రైట్స్‌ ఇష్యూ ధరను నిర్ణయించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదిత రైట్స్‌ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేర్‌ (రూ.10 ముఖ విలువ) ధరను

అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు

Thursday 21st March 2019

- మూడేళ్లలో 52 ప్రాజెక్టుల విక్రయం - రూ. 37,019 కోట్ల విలువ - నిధుల కొరత తదితర సమస్యలే కారణం ముంబై: గత కొన్నాళ్లుగా పలు రహదారి ప్రాజెక్టులు అమ్మకానికి వస్తున్నాయి. నిధుల కొరత తదితర కారణాలతో ప్రమోటర్లు లేదా వాటి నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ) వీటిని విక్రయిస్తున్నాయి. 2015-18 మధ్యకాలంలో ఏకంగా 52 రహదారి ప్రాజెక్టులను ప్రమోటర్లు విక్రయించారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం

Most from this category