STOCKS

News


కొచర్‌పై ‍కొనసాగుతున్న ప్రశ్నల వర్షం

Tuesday 5th March 2019
news_main1551760986.png-24431

అక్రమ ధనార్జన కేసులో నాల్గవరోజు ఈడీ చర్యలు
ముంబై: అక్రమ ధనార్జనా కేసులో సోమవారం వరుసగా నాల్గవరోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందాకొచర్‌ను ప్రశ్నించారు.  చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నాలుగురోజులుగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   వీడియోకాన్‌కు చెందిన కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ముంబై, ఔరంగాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.1,875 కోట్ల రుణ మంజూరు విషయంలో తీవ్ర అవకతవకలు, అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈడీ, ఈ అంశంలో తదుపరి విచారణను తీవ్రతరం చేసింది.

మార్చి 1 నుంచీ...
మార్చి 1న చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌లను సౌత్‌ ముంబైలోని వారి నివాసంలో ఐడీ అధికారులు మొదటిసారి ప్రశ్నించారు. సోమవారం ఇక్కడి ఈడీ కార్యాలయంలో అమెను అధికారులు తాజాగా ప్రశ్నించారు. కాగా ఆదివారం ఈడీ అధికారులు మాటిక్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకులు రవి రుయా మేనల్లుడు నిషాంత్‌ కనోడియాను కూడా ప్రశ్నించారు. మారిషస్‌ ‍కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన ఫస్ట్‌లాండ్‌ హోల్డింగ్స్‌ దీపక్‌ కొచర్‌ నిర్వహిస్తున్న నూపవర్‌ రెన్యువబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ కేసులో వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ దూత్‌పై మార్చి2న ఈడీ అధికారులు అర్థరాత్రి వరకూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.



You may be interested

టాటా గ్రూప్‌ దశావతారం

Tuesday 5th March 2019

పది వెర్టికల్స్‌గా గ్రూపు వ్యాపారాల వర్గీకరణ మరింత సమన్వయంతో సాఫీగా సాగేలా నిర్ణయం ఖర్చులు ఆదా చేసుకునే యోచన మరికొన్ని నెలల్లో కసరత్తు పూర్తి న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు నూతన జవసత్వాలు తీసుకొచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గ్రూపు పరిధిలో 100 వరకు కంపెనీలుండగా, వీటిల్లో 30 మాత్రమే లిస్టయి ఉన్నాయి. వీటికి అదనంగా 1,000 వరకు సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి. భారీ సంఖ్యలో కంపెనీలు ఉండటంతో ఏవో కొన్ని మినహాయిస్తే మిగిలినవి అంతగా

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో రూ.13,000 కోట్ల అవకతవకలు

Tuesday 5th March 2019

గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఆడిట్‌లో వెల్లడి న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ సంస్థ ఆడిట్‌లో వెలుగు చూసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు 24 డైరెక్ట్‌ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు, నాలుగు అసోసియేట్‌ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల

Most from this category