STOCKS

News


బైజూస్‌ నుంచి ఎర్లీ లెర్న్‌యాప్‌

Friday 7th June 2019
Markets_main1559890140.png-26155

బెంగళూరు: ఆన్‌లైన్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బైజూస్‌... తాజాగా ఎర్లీ లెర్న్‌ యాప్‌ను విడుదల చేసింది. 6-8 ఏళ్ల వయసు గ్రూపులోని  (1-3 తరగతులు) వారి కోసం ఈ యాప్‌ను రూపొందించినట్టు థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బైజూస్‌ మాతృ సంస్థ) తెలిపింది. డిస్నీ కథలు, క్యారక్టర్లతో అలరిస్తూ  విద్యార్థుల కోసం ఉద్దేశించిన వ్యక్తిగత ప్రొగ్రామ్‌లను ఈ యాప్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ యాప్‌లో వేలాది యానిమేటెడ్‌ వీడియోలు, గేమ్‌లు, స్టోరీలు, క్విజ్‌లు, డిజిటల్‌ వర్క్‌ షీట్లను పొందుపరిచింది. తల్లిదండ్రులకు వారి పిల్లల సామర్థ్యాలను తెలియజేసే ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోనూ తీసుకురానున్నట్టు సంస్థ తెలిపింది.



You may be interested

11830 పాయింట్లకు దిగువన మరింత పతనం!

Friday 7th June 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో కొత్త షార్ట్స్‌ తీసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిఫ్టీలో స్వల్పకాలిక ట్రెండ్‌ రివర్సల్‌ ఆరంభమైందని నిపుణుల భావన. నిఫ్టీ 11830 పాయింట్ల దిగువన బలంగా క్లోజయితే ట్రెండ్‌ రివర్సల్‌ను నిర్ధారించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టీ క్రమంగా 11600 పాయింట్ల వరకు పతనం కావచ్చు. పైన 12103 పాయింట్ల వద్ద అప్‌సైడ్‌నిరోధం కనిపిస్తోంది.

ఆగిపోయిన ఫియట్‌ క్రిస్లర్‌, రెనోల విలీనం

Friday 7th June 2019

పారిస్: ప్రముఖ వాహన తయారీ కంపెనీలైన ఫియట్‌ క్రిస్లర్‌, రెనో సంస్థల మధ్య విలీన ఒప్పందం వీగిపోయింది. ఫ్రాన్స్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీలిన ప్రతిపాదనను తిర‌స్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఫియట్‌ క్రిస్లర్‌ గురువారం ప్రకటించింది. గతనెల్లో ఈ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్‌లోని రెనో ప్రధానకార్యాలయంలో ఇరు కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సమావేశమై.. తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయ పరిస్థితులు

Most from this category