STOCKS

News


మల్టీ - బ్రాండ్‌లో ఎఫ్‌డీఐలు అనుమతించలేదు

Friday 4th January 2019
Markets_main1546575783.png-23402

  • డీఐపీపీ వివరణ

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగ నిబంధనలకు చేసిన సవరణల ప్రకారం దొడ్డిదారిలో మల్టీ-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చినట్లు వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఇన్వెంటరీ ఆధారిత విధానంలో గానీ లేదా మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలో గానీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించలేదని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గురువారం వివరణనిచ్చింది. ఈ-కామర్స్ సంస్థలు నిర్దేశిత నిబంధనలను అడ్డదారిలో ఉల్లంఘించకుండా ఉండేలా చూసేందుకే ఇటీవలి సవరణల ప్రధానోద్దేశమని పేర్కొంది. "ప్రెస్‌నోట్‌ 3/2016 ద్వారా మల్టీ బ్రాండ్ రిటైల్‌ ట్రేడింగ్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించినట్లు కొన్ని వర్గాలు భాష్యం చెబుతున్నాయి. ఇవి పూర్తిగా తప్పుడు అభిప్రాయాలు. మల్టీ-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించలేదంటూ సదరు ప్రెస్‌ నోట్‌లో స్పష్టంగా చెప్పడం జరిగింది" అని డీఐపీపీ ఒక నోట్‌లో పేర్కొంది. విదేశీ పెట్టుబడులు గల ఈ-కామర్స్ సంస్థలు తమకు వాటాలు ఉన్న కంపెనీల ఉత్పత్తులను సొంత పోర్టల్స్‌లో విక్రయించకుండా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, బడా కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐ నిబంధనలకు ఎటువంటి మార్పులు చేయొద్దంటూ కేంద్రాన్ని వ్యాపార వర్గాల సమాఖ్య సీఏఐటీ కోరింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయిన సీఏఐటీ ప్రతినిధులు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ట్రేడర్లందరికీ సమాన అవకాశాలు లభించేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.



You may be interested

రూ. 80 వేల కోట్ల రికవరీ..

Friday 4th January 2019

- అదే బాటన మరో రూ.70 వేల కోట్లు - బ్యాంకింగ్‌ రికవరీలో ఎన్‌సీఎల్‌టీ పాత్ర భేష్‌ - ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్‌సీఎల్‌టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా

జీఎస్‌టీ ఐటీసీ ప్రయోజనానికి గడువు పొడిగింపు

Friday 4th January 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)  ప్రారంభమైన మొదటి ఆర్థిక సంవత్సరానికి (2017-18) సంబంధించి  పరిశ్రమలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ (ఐటీసీ) చేసుకునేందుకు గడువును ఆర్థికశాఖ పొడిగించింది. ఈ గడువును ఈ ఏడాది మార్చి 2019 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. అయితే తమ సరఫరాదారు దాఖలు చేసిన రిటర్న్స్‌కు (జీఎస్‌టీఆర్‌-2ఏ- సరఫరాదారు దాఖలు చేసిన సేల్స్‌ రిటర్న్స్‌ ఆధారంగా సిస్టమ్స్‌ ఆటోమేటిక్‌గా సృష్టించేది)  సరిపోలితేనే ఐటీసీ

Most from this category