STOCKS

News


ఈ కామర్స్‌ సంస్థలకు గడువు పొడిగింపు లేదు

Friday 1st February 2019
news_main1549006587.png-23940

  • ఫిబ్రవరి 1 నుంచే కొత్త నిబంధనల అమలు
  • ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో ఈ కామర్స్‌ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్‌ సం‍స్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్‌ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది. కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ కేంద్రాన్ని కోరాయి. జూన్‌ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్‌ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్‌ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్‌ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్‌ సంస్థలు స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌ సైతం కోరాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తరహా ఈ రిటైలింగ్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్‌ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ ప్లాట్‌ఫామ్‌పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్‌-బిని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్‌
నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్‌ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్‌డీల్‌
చిన్న ఈ కామర్స్‌ సంస్థలు స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్‌ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్‌డీల్‌ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్‌క్లూస్‌ సీఈవో విజయ్‌సేతి అభివర్ణించారు.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు

Friday 1st February 2019

స్వతంత్ర సీఏ సంస్థను నియమించిన కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తనిఖీలు చేస్తాం.... డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ

దిద్దుబాటు చర్యల చట్రం నుంచి మూడు బ్యాంకులకు విముక్తి

Friday 1st February 2019

- బీఓఐ, బీఓఎం, ఓబీసీలపై  ఆంక్షలు తొలగించిన ఆర్‌బీఐ ముంబై:  మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కార దిశలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలోకి (పీసీఏ- ప్రాంట్‌ కరెక్టివ్‌ యాక్సన్‌) వెళ్లిన 11 బ్యాంకుల్లో మూడింటికి విముక్తి లభించింది. రుణాలు ఇవ్వడానికి సంబంధించి ఈ మూడు బ్యాంకులపై ఉన్న ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేసింది. వీటిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) ఓరియెంటల్‌ బ్యాంక్‌

Most from this category