STOCKS

News


చిన్న చమురు క్షేత్రాల్లోకి రూ.8,400 కోట్ల పెట్టుబడులు

Thursday 13th September 2018
news_main1536813495.png-20215

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: చిన్న స్థాయి చమురు, సహజ వాయువు నిక్షేపాల రెండవ రౌండు వేలం అనంతరం ఆయా క్షేత్రాల్లోకి సుమారు రూ.8,400 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) వి.పి.జాయ్‌ అంచనా వేశారు. చిన్న క్షేత్రాల అన్వేషణ (డీఎస్‌ఎఫ్‌) మొదటి రౌండు వేలంతో పోలిస్తే రెండో రౌండులో విజేతలైన బిడ్డర్లు రెట్టింపు పెట్టుబడులు పెట్టే అవకాశమున్నట్లు ఆయన చెప్పారు. రెండో విడత వేలంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ల సదస్సును బుధవారం హైదరాబాద్‌తో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయ్‌ మాట్లాడుతూ... ‘‘మొదటి విడత చిన్న క్షేత్రాల వేలంతో పోలిస్తే ఈ సారి వేలానికి పెట్టిన నిక్షేపాల విస్తీర్ణం రెండింతలై 3,042 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అలాగే నిక్షేపాలు కూడా రెట్టింపయి 190 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరుతున్నాయి. వీటిలో 97.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ముంబై తీరంలోను, 55.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కృష్ణా-గోదావరి తీరంలోను విస్తరించాయి. రెండో రౌండులో 25 కాంట్రాక్టు ఏరియాలకు గాను 59 క్షేత్రాలను వేలం వేస్తున్నాం’’ అని వివరించారు. బిడ్లకు డిసెంబరు 18 చివరితేదీ. 2019 జనవరి- ఫిబ్రవరికల్లా ఈ ప్రక్రియ పూర్లయ్యే అవకాశం ఉంది. పెట్రోలియం అన్వేషణ లీజు దక్కించుకున్న కంపెనీలు మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది.



You may be interested

టియాగో ఎన్ఆర్‌జీ @ రూ.5.49 లక్షలు

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: టియాగో హచ్‌బ్యాక్‌ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదలచేసింది. ‘టియాగో ఎన్ఆర్‌జీ’ పేరిట విడుదలైన ఈ ఎస్‌యూవీలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, ట్యూన్డ్ సస్పెన్షన్ వంటి ఫ్యూచర్లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండడంతో భద్రతా వ్యవస్థ మునుపటి వెర్షన్ల కంటే ఎక్కువని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎండీ గుంటెర్ బుషెక్‌ వివరించారు. 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన ఎన్ఆర్‌జీని ‘అర్బన్ టఫ్‌రోడ్డర్‌’గా

కొత్త ఐఫోన్‌ టెన్‌ఎస్‌ వచ్చేసింది ..

Thursday 13th September 2018

క్యుపర్టినో, కాలిఫోర్నియా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌.. ఐఫోన్‌ టెన్‌ఎస్‌ ఫోన్లను  ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్‌ టెన్‌ఎస్‌ మ్యాక్స్‌) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఇవి లభిస్తాయి.  512 జీబీ దాకా మెమరీ ఉంటుంది.   వీటితో పాటు వాచ్‌లకు సంబంధించి సిరీస్‌ 4ను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది. పాత వాటితో

Most from this category