STOCKS

News


డీఆర్‌ఐ భేష్‌!

Wednesday 5th December 2018
news_main1543985332.png-22648

న్యూఢిల్లీ: దేశ ఆర్థికవ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించే కేసులను డీల్‌ చేసే డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌)పై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని అన్ని విచారణా సంస్థలు, ఏజన్సీల్లో డీఆర్‌ఐ మాత్రమే ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు. తన పనేదో తాను చూసుకోవడం, తన పరిధి మేరకు ప్రవర్తించడం వల్లనే డీఆర్‌ఐ వివాదాల జోలికి పోకుండా పనిచేస్తోందన్నారు. దేశానికి, దేశ భద్రతకు వాటిల్లే ఆర్థిక ప్రమాదాలను నివారించడమనేది డీఆర్‌ఐ ప్రాధమిక కర్తవ్యమని, ఈ కర్తవ్యనిర్వహణలో డీఆర్‌ఐ ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతోందని కొనియాడారు. డీఆర్‌ఐ 61వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కస్టమ్స్‌ చట్టాల ఉల్లంఘన, స్మగ్లింగ్‌ లాంటి నేరాలను విచారించే అత్యున్నత సంస్థ డీఆర్‌ఐకి ఆయన కొన్ని దిశానిర్ధేశాలు చేశారు. అత్యున్నతమైన ప్రమాణాలు పాటించడం, విచారణను అతి గోప్యంగా ఉంచడం, పరిపూర్ణమైన సాధికార సంస్థగా మారాలన్న యోచనతో పనిచేయడం డీఆర్‌ఐకి చాలా అవసరమని సూచించారు. డీఆర్‌ఐ మరింత సమర్ధవంతమైన ఏజన్సీగా రూపొందాలని ఆయన అభిలషించారు. ప్రతి పరిశోధనా సంస్థ కొన్ని నైతిక నియమాలను పాటించాలని, అప్పుడే కచ్ఛితత్వాన్ని సాధిస్తాయని హితవు పలికారు. ఈ నియామవళిలో ముఖ్యమైనది ప్రొఫెషనిలిజమని, నేర నివారణే ధ్యేయంగా ఏజన్సీలు పనిచేయాలని ఆయన చెప్పారు. 
రచ్చ మంచిది కాదు
ప్రాధమిక విచారణ ఆరంభం కాగానే తాము కనుగొన్న విషయాలను మీడియాకు వెల్లడించాలన్న దుగ్ధను ఆపుకోవాలని ఏజన్సీ అధికారులకు అరుణ్‌జైట్లీ చురకలు వేశారు. ప్రతిచిన్న విషయాన్ని తుర్రుమంటూ మీడియా ముందు పంచుకోవడం సబబు కాదన్నారు. ఏజన్సీలంటే అత్యున్నత వృత్తి ప్రమాణాలు పాటించాలని, అంతేకాని విచారణకు అవరోధాలు కలిగించేలా రచ్చకెక్కడం మంచిది కాదని చెప్పారు. ఇలా మీడియా ముందుకు పరిగెత్తే బదులు విచారిస్తున్న కేసులో బలమైన సాక్ష్యాలు సంపాదించేందుకు యత్నించాలన్నారు. విచారణాధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ జరపాలని హితవు చెప్పారు. నేరాన్ని రుజువు చేసి దోషులకు జరిమానాలు, శిక్షలు పడేలా చేయడమే ఏజన్సీలకు అసలైన పరీక్షని చెప్పారు. మీడియా దృష్టి పడకుండా విచారణ సాగించడమే అధికారులకు మంచిదని జైట్లీ చెప్పారు. ఏజన్సీలకు సంబంధించి ఏ వార్తా బైటికి పొక్కడం మంచిది కాదని, అందువల్ల ప్రాధమిక విచారణలో వెల్లడయ్యే విషయాలను చాటింపు వేసుకోకూడదని చెప్పారు. విచారణలో విషయాలు ముందే బయటకు రావడం ఏజన్సీల ఘనతను తగ్గిస్తుందన్నారు. విచారణ జరిపే అధికారి, అతని పర్యవేక్షకుడికి సిక్త్స్‌సెన్స్‌ అధికంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కేసుకు విచారణార్హత ఉందా? ఈ కేసులో జరిమానాలు, శిక్షలకు అవకాశం ఉందా? అనేది నిర్ణయించుకొని ముందుకు సాగాలన్నారు. 
స్వీయ నియమావళి కీలకం
విచారణా సంస్థల చుట్టూ వివాదాల ముసురు ముట్టిన వేళ ఇకపై అనవసరమైన ఆరోపణలు రాకుండా ఉండేందుకు కొన్ని నైతిక నియమాలుండాలని అరుణ్‌ జైట్లీ ప్రతిపాదించారు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు అత్యున్నతమైన వృత్తి ప్రమాణాలు పాటించడం, అనవసరంగా రచ్చకెక్కకుండా ఉండడం, ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందుకు పరిగెత్తకుండా సంయమనం పాటించడం.. లాంటి నియమాలు పాటించాలని జైట్లీ సూచించారు. నైతిక విలువలు, సమగ్రత, వృత్తిపరమైన ప్రమాణాలను పాటించడంపైనే ఒక ఏజన్సీ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని తెలిపారు. తప్పు మానవ సహజమని, అందువల్ల నూటికి నూరుపాళ్లు తప్పు చేయకుండా ఉండడం కుదరదని, అయితే వీలయినంతగా తప్పులు దొర్లకుండా ముందుకు సాగడం అవసరమని ఆయన వివరించారు. విచారణ సందర్భంగా ఏ ఒక్క అమాయకుడు, నిర్దోషి బాధపడకుండా చూసుకోవాలని, అదే సమయంలో ఏ ఒక్క దోషి తప్పించుకోకుండా జాగ్రత్త పడాలని సలహా ఇచ్చారు. ఇటీవల కాలంలో సీబీఐలో బడా బాసుల మధ్య వివాదం ముదిరి రచ్చకెక్కిన సంగతి తెలిసిందే! చినికి చినికి గాలివానగా మారిన ఈ దుమారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. 
 You may be interested

జియోస్వాన్‌లో జియో మ్యూజిక్‌

Wednesday 5th December 2018

హైదరాబాద్‌: రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అనుబంధ సంస్థ స్వాన్‌ మీడియా జియోస్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇందులో జియో మ్యూజిక్‌ అనుసంధానమై ఉంటుంది. జియోస్వాన్‌ యాప్‌లో మ్యూజిక్, లైవ్‌ స్ట్రీమింగ్, కన్సర్ట్స్, లిరిక్స్, ఎక్స్‌క్లూజివ్‌ వీడియోలు తదితరాలను పొందే వీలుంటుంది. ఆర్‌ఐఎల్‌ ఈ ఏడాది మార్చిలో స్వాన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుం జియోకు 252 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లున్నారు.  

టాటా మోటార్స్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్‌

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌, దాని అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌ రోవర్ (జేఎల్‌ఆర్‌) రేటింగ్స్‌ను ఎస్‌అండ్‌పీ సంస్థ డౌన్‌గ్రేడ్ చేసింది. బలహీన లాభదాయకత అంచనాలతో క్రెడిట్ రేటింగ్‌ను, సీనియర్ అన్‌సెక్యూర్డ్ నోట్స్‌ రేటింగ్‌ను ప్రస్తుత 'బిబి' స్థాయి నుంచి 'బిబి మైనస్‌' స్థాయికి ఎస్‌అండ్‌పీ కుదించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. అలాగే, ఇదే కారణంతో జేఎల్‌ఆర్‌ రేటింగ్‌ను కూడా 'బిబి' స్థాయి నుంచి 'బిబి మైనస్'

Most from this category