STOCKS

News


అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ 'గ్లీవెక్' ఔషధం

Tuesday 2nd October 2018
news_main1538450621.png-20766

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇమాటినిబ్ మెసిల్యేట్ ట్యాబ్లెట్స్‌ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్‌) వెల్లడించింది. నొవార్టిస్‌ ఫార్మాకి చెందిన గ్లీవెక్‌ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్‌. అమెరికాలో గ్లీవెక్‌ బ్రాండ్‌, జనరిక్‌ వార్షిక అమ్మకాలు సుమారు 868 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరోవైపు, అమెరికాలోని బ్రిస్టల్‌లో తమకున్న యాంటీబయోటిక్ తయారీ కేంద్రాన్ని నియోఫార్మాకు విక్రయించే డీల్ పూర్తయినట్లు డీఆర్‌ఎల్ తెలిపింది. అటు యాంటీబ్యాక్టీరియల్ ఉత్పత్తి డీఎఫ్‌ఏ-02కి సంబంధించి ఆర్మిస్ బయోఫార్మాకి ఇచ్చిన లైసెన్సును రద్దు చేసినట్లు వివరించింది. 



You may be interested

హైదరాబాద్‌లో ఒపో ఆర్‌అండ్‌డీ సెంటర్‌

Tuesday 2nd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఒపో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి కూడా సిద్ధమవుతోంది. కంపెనీకి ఇది భారత్‌లో తొలి సెంటర్‌ కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏడవది. చైనాలో నాలుగు, జపాన్‌, యూఎస్‌లో ఒక్కో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. భారత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉపకరణాల అభివృద్ధిలో హైదరాబాద్‌ సెంటర్‌ నిమగ్నం కానుంది. శామ్‌సంగ్‌

టూ-వీలర్ల అమ్మకాల వృద్ధి 5 శాతమే !

Tuesday 2nd October 2018

 టూ-వీలర్ల అమ్మకాల వృద్ధి రానున్న రెండేళ్లలో 5 శాతం మేర మాత్రమే ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ సంస్థ అంచనా వేస్తోంది. వాహన కంపెనీలు టూ-వీలర్ల ధరలను పెంచడం,  పెట్రోల్‌ ధరలతో పాటు బీమా వ్యయాలు  కూడా పెరుగుతుండటం టూ-వీలర్ల అమ్మకాలపై గణనీయంగానే ప్రభావం చూపిస్తాయని ఈ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ♦ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి టూ-వీలర్లలో ఏబీఎస్‌/సీబీఎస్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. దీంతో

Most from this category