STOCKS

News


మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈ–కేవైసీ వాడొద్దు

Saturday 27th October 2018
news_main1540609282.png-21506

న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్‌ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్‌ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టెలికం శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. 



You may be interested

జియో ట్యారిఫ్‌లు పెరగనట్లే..

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: దేశీ టెలికాం రంగం మరింత మంది కస్టమర్లను చేరుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మొబైల్‌ టారిఫ్‌ల పెంపు కుదరదని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ 40 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్లనే వాడుతున్నారని, వీరిని చేరుకోవాలంటే.. కంపెనీలు టారిఫ్‌లను పెంచకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గిగాబైట్‌ వ్యయం తగ్గించడం, పెంచడం అనేది ఇక్కడ విషయం కాదని.. ఆవిష్కరణలతో ముందుకు కొనసాగే సంస్థలకే మనుగడ ఉంటుందని

ఇన్వెస్టర్ల సంగతేమో... ఫండ్స్‌కు అయితే లాభాలే!

Saturday 27th October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌)ను సెబీ ఇటీవల తగ్గించింది. ఇది ఆయా సంస్థల భవిష్యత్తు ఆదాయాలపై ప్రతిఫలించనుంది. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు (ఏఎంసీలు) లాభాలు, ఆస్తుల విలువ వృద్ధి పరంగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2017-18) గుర్తుండిపోతుంది. ఏఎంసీలు అన్నింటికీ కలిపి వచ్చిన ఆదాయం రూ.14,000 కోట్లు.    ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఇన్వెస్కో మ్యూచువల్‌

Most from this category