STOCKS

News


ఓఎంసీల డివిడెండ్‌లు తగ్గవు

Wednesday 10th October 2018
news_main1539148058.png-20997

న్యూఢిల్లీ: ఇంధనాలపై సబ్సిడీ భారం కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) కేంద్రానికి ఇచ్చే డివిడెండ్లో ఈసారి కోత పడొచ్చన్న వార్తలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ తోసిపుచ్చారు. డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం తగ్గొచ్చని, సబ్సిడీల్లో కోత పెట్టొచ్చని వస్తున్న వార్తలను ఖండించారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. సబ్సిడీల్లో కోత పెట్టే యోచనేదీ ప్రభుత్వానికి లేదన్నారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్నట్లుగా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్ల లక్ష్యాన్ని సాధిస్తామని గర్గ్ తెలిపారు. ప్రణాళికల ప్రకారం నేషనల్ ఇన్సూరెన్స్‌, యునైటెడ్ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లను విలీనం చేసి, స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 
భారీగా ఎగిసిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రూ.2.50 మేర తగ్గింపు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.1.50 ఎక్సయిజ్ సుంకాల తగ్గింపు రూపంలో ఉండనుండగా, మిగతా రూ. 1 భారాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాల్సి వస్తోంది. దీని ప్రకారం వార్షికంగా చూస్తే ఆయిల్ కంపెనీల లాభాలు రూ. 9,000 కోట్ల మేర తగ్గుతాయి. ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ఇవి రూ.4,500 కోట్ల మేర తగ్గొచ్చని అంచనా. ఇందులో దాదాపు సగభాగం ఐవోసీది కాగా.. మిగతాది హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ వాటాగా ఉండనుంది. ఈ పరిణామాల దరిమిలా ఆయిల్ కంపెనీలు కేంద్రానికి చెల్లించే డివిడెండ్లు ఈసారి తగ్గొచ్చని వార్తలు వచ్చాయి. 



You may be interested

భారత్‌కు మూడీస్‌ ‘క్రెడిట్‌ నెగటివ్‌’!

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల కోత ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్‌ నెగటివ్‌’ అని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- వ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 3.3 శాతంగా ఉండాలన్న కేంద్ర బడ్జెట్‌ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, ఇది 3.4 శాతానికి పెరిగే

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం అప్‌

Wednesday 10th October 2018

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 24,596.60 వద్ద ప్రారంభమైంది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 1.50శాతం పెరిగి 24,853.70 వద్దకు చేరుకుంది. ఈ సూచీలోని భాగమైన మొత్తం 12 షేర్లలో 11 షేర్లకు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, యస్‌ బ్యాంక్‌ మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, అర్‌బీఎల్‌ షేర్లు

Most from this category