STOCKS

News


డిస్కవర్‌ 100 సీసీ ఘోర తప్పిదం..

Friday 23rd November 2018
news_main1542948221.png-22327

ముంబై: మోటార్‌సైకిల్ శ్రేణి డిస్కవర్‌లో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టడం తన కెరియర్‌లో ఘోర తప్పిదమని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌ వ్యాఖ్యానించారు. దీనితో తమ సంస్థ దేశీ ద్విచక్రవాహనాల మార్కెట్లో నంబర్- 2 స్థానానికి పరిమితమైపోయిందని చెప్పారాయన. ఒకవేళ 100 సీసీని ప్రవేశపెట్టకుండా ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. ‘‘డిస్కవర్‌లో 125సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇటు మైలేజీతో పాటు అటు అధిక సామర్ధ్యంతో పనిచేసే బైక్‌గా ప్రత్యేకత ఉండేది. గణనీయంగా పెరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత అత్యాశకు పోయాం. 125 సీసీ డిస్కవర్ బైకులు ఇంత భారీగా అమ్ముడవుతున్నాయంటే.. ఇక 100 సీసీ బైక్‌లు ఇంకా భారీగా అమ్ముడవుతాయంటూ మా మార్కెటింగ్ సిబ్బంది అభిప్రాయపడ్డారు. దీంతో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టాం. అంతే... మా ప్రత్యేకత పోయింది. అయిదేళ్ల తర్వాత మా పనితీరు కూడా దెబ్బతింది. విభిన్నంగా ఉండాలనే ప్రయత్నంతో డిస్కవర్ 125 సీసీని తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత మూసధోరణిలోకి పోయాం. ఈ మూసధోరణి అనేది జీవితంలోనైనా, మార్కెటింగ్‌లోనైనా చాలా చెడ్డది" అని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. అప్పుడెప్పుడో చేసిన తప్పిదానికి తమ కంపెనీ ఇప్పటికీ రెండో స్థానానికే (బైక్‌ల అమ్మకాల పరిమాణం పరంగా) పరిమితమైపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. 
ఆశావహంగా కేటీఎం..
తాము ఇన్వెస్ట్ చేసిన ఆస్ట్రియన్‌ రేసింగ్ బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం అవకాశాలు ఆశావహంగా ఉన్నాయని రాజీవ్ బజాజ్ ధీమా వ్యక్తం చేశారు. 2007లో తాము ఇన్వెస్ట్ చేసినప్పుడు కేటీఎం ఏటా 65,000 బైక్‌లు మాత్రమే తయారు చేసేదని, అయినప్పటికీ యూరప్‌లో రెండో అతి పెద్ద మోటర్‌ సైకిల్ బ్రాండ్‌గా ఉండేదని ఆయన తెలియజేశారు. ‘‘అప్పట్లో మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్‌సన్‌ ఏడాదికి 3.5 లక్షల బైకులు తయారు చేసేది. అయితే, గత కొన్నాళ్లుగా హార్లే ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది 2.4 లక్షల వాహనాలే తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. కేటీఎం మాత్రం అంతకు మించి 2.7 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయనుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు రాజీవ్ చెప్పారు.



You may be interested

మళ్లీ కొలువుల  జోరు

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: ఉద్యోగాలు వచ్చే ఏడాది జోరుగా రానున్నాయని ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌, 2019  పేర్కొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐటీ, వాహన, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రానున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, హెచ్‌ఆర్‌ టెక్నాలజీ కంపెనీ పీపుల్‌ స్ట్రాంగ్‌, గ్లోబల్‌ టాలెంట్‌ అసెస్‌మెంట్‌ సంస్థ వీబాక్స్‌ సంస్థలు, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో ఈ నివేదికను రూపొందించాయి. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అధిక అవకాశాలుంటాయంటున్న

సిబ్బందికి పంచకుంటే పన్ను కట్టాల్సిందే..

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్ల నుంచి వసూలు చేసే సర్వీస్‌ చార్జీని వర్కర్లు, సిబ్బందికి గానీ పంచని పక్షంలో ఆ మొత్తాన్ని సంస్థ ఆదాయంగానే పరిగణించడం జరుగుతుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. సదరు ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్ల ఖాతాలు తనిఖీ చేయాలని.. సర్వీస్ చార్జీల వసూళ్లలో ఎక్కువ, తక్కువలు చేసి చూపుతున్నాయేమో పరిశీలించాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించింది. మార్గదర్శకాలకు

Most from this category