STOCKS

News


సీపీఎస్‌ఈల అసెట్స్‌ విక్రయానికి ప్రత్యేక విభాగం

Tuesday 5th March 2019
news_main1551765034.png-24437

  • సీపీఎస్‌ఈల అసెట్స్‌ విక్రయానికి ప్రత్యేక విభాగం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) ప్రాధాన్యేతర ఆస్తుల్ని విక్రయించే ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తోంది. అసెట్ మానిటైజేషన్ సెల్‌ పేరిట ఏర్పాటయ్యే ఈ విభాగం... అటు శతృ ఆస్తుల విక్రయానికి (భారత్ నుంచి పాకిస్తాన్‌, చైనాకి వలసపోయిన వారు) సంబంధించిన కేసులను కూడా పర్యవేక్షిస్తుంది. "సీపీఎస్‌ఈల ప్రాధాన్యేతర అసెట్స్ విక్రయ ప్రక్రియ విషయంలో ఆయా సంస్థలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ప్రత్యేకంగా అసెట్‌ మానిటైజేషన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. లావాదేవీల సలహాదారులు, అసెట్స్‌ వేల్యుయర్స్‌ని కూడా ఇదే నియమిస్తుంది" అని సంబంధిత అధికారి తెలిపారు. దీనికి సారథ్యం వహించేందుకు పర్సనల్ డిపార్ట్‌మెంట్‌ నుంచి డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని కేంద్రాన్ని దీపం కోరినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న కేంద్రం దాదాపు రూ. 56,473 కోట్లు సేకరించింది.



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Tuesday 5th March 2019

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలకు ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ అండగా నిలుస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2,826ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఐడీబీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) బ్యాంక్‌ షేరు 6శాతం లాభపడింది. సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 4శాతం, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌

రూ. 12 వేల కోట్లకు ఆన్‌లైన్ గేమింగ్‌

Tuesday 5th March 2019

రూ. 12 వేల కోట్లకు ఆన్‌లైన్ గేమింగ్‌ - 2023 ఆర్థిక సంవత్సరం నాటికి అంచనా - 2018-2023 మధ్య 22 శాతం వార్షిక వృద్ధి - కేపీఎ౾ంజీ- గేమింగ్ ఫెడరేషన్‌ నివేదికలో వెల్లడి ముంబై: డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.11,900 కోట్లకు చేరనున్నట్లు కేపీఎంజీ- ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ రూపొందించిన నివేదిక

Most from this category