STOCKS

News


గూగుల్ మ్యాప్స్‌లో డైనింగ్ ఆఫర్లు

Friday 12th July 2019
news_main1562913653.png-27004

న్యూఢిల్లీ: భారతీయ యూజర్స్‌ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్‌ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉంది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్ సంస్థతో కలిసి 'ఆఫర్‌' ఫీచర్ అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్‌లో ఆఫర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ఆఫర్స్‌ షార్ట్‌కట్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని కింద గురువారం మొదలు 15 రోజుల దాకా 1,500 పైచిలుకు రెస్టారెంట్లలో ఈజీడైనర్ ప్రత్యేక ప్రైమ్ ఆఫర్స్‌ను, కనీసం 25 శాతం డిస్కౌంట్‌ను కచ్చితంగా పొందవచ్చని గూగుల్ వివరించింది. ఇక దేశీ యూజర్స్‌ అభిరుచులకు అనుగుణంగా ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌ను తీర్చిదిద్దామని, ఇందులో కొత్తగా రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు, ఏటీఎంలు మొదలైన ఏడు విభాగాల షార్ట్‌కట్స్ చేర్చామని పేర్కొంది. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫర్‌ యూ' ట్యాబ్‌ ద్వారా కొత్త రెస్టారెంట్లు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అందించే సిఫార్సులను పొందవచ్చని గూగుల్ పేర్కొంది. 



You may be interested

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

Friday 12th July 2019

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.13,000 కోట్లకుపైగా రుణ ఎగవేతల కేసులో మెహుల్‌ చోక్సీకి చెందిన రూ.22.77 కోట్ల విలువైన ఆస్తులనున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం జప్తు చేసింది. దుబాయ్‌లో మూడు కమర్షియల్‌ అసెట్స్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు, దేశ విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న కొన్ని ఫిక్డ్డ్స్‌ డిపాజిట్లు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చోక్సీపై ఉత్తర్వులు జారీ

ఆటో ఫలితాలు నిరుత్సాహకరం: బ్రోకరేజ్‌ల అంచనాలు

Friday 12th July 2019

  గత ఏడాది నుంచి దేశియ ఆటో రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. తగ్గిన డిమాండ్‌, అధిక బేస్‌, ప్రతికూల ఆపరేటింగ్‌ లెవరేజ్‌, లిక్విడిటీ సమస్యలు, అధికంగా రాయితీలు ప్రకటించడం వంటి వాటి వలన ఆటో రంగ జూన్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్సరం నుంచి ప్రస్తుత తేది వరకు(వై టూ డీ) గల డేటా ప్రకారం మారుతి షేరు 38 శాతం

Most from this category