STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు

Friday 1st February 2019
news_main1549006784.png-23941

  • స్వతంత్ర సీఏ సంస్థను నియమించిన కంపెనీ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అవసరమైతే తనిఖీలు చేస్తాం....
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ వీటిల్లో 31,000 కోట్ల మేర నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ఆన్‌లైన్‌న్యూస్‌ పోర్టల్‌, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రి శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా కంపెనీల రిజిష్ట్రార్‌(ముంబై)...డొల్ల కంపెనీలుగా చెప్పబడుతున్న కొన్ని సంస్థలను గుర్తించడానికి ప్రయత్నించింది. రికార్డుల్లో ఉన్న చిరునామాల్లో సదరు కంపెనీలు లేవని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. అవసరమైతే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి సమాచారం కోరతామని పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలను పట్టి తనిఖీలు కూడా చేపడతామని వివరించారు. కాగా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి దర్యాప్తు విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది.



You may be interested

8 రంగాల గ్రూప్‌ వృద్ధి పేలవం

Friday 1st February 2019

- డిసెంబర్‌లో కేవలం 2.6 శాతం - 18 నెలల కనిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల గ్రూప్‌ వృద్ధి రేటు డిసెంబర్‌లో నిరాశ పరిచింది. కేవలం 2.6 శాతంగా నమోదయ్యింది. గడచిన 18 నెలల్లో ఈ గ్రూప్‌ ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎమినిది రంగాల్లో క్రూడ్‌ ఆయిల్‌, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల నిరాశాకర ఫలితాలను వెలువరించాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి  సూచీ (ఐఐపీ)లో దాదాపు

ఈ కామర్స్‌ సంస్థలకు గడువు పొడిగింపు లేదు

Friday 1st February 2019

ఫిబ్రవరి 1 నుంచే కొత్త నిబంధనల అమలు ప్రభుత్వం స్పష్టీకరణ న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో ఈ కామర్స్‌ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్‌ సం‍స్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్‌ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన

Most from this category