STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లాభం 53% జంప్‌

Wednesday 21st November 2018
news_main1542795588.png-22269

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 53 శాతం మేర ఎగసింది. రూ.438 కోట్లుగా నమోదయ్యింది. లిక్విడిటీ సంక్షోభం, అధిక కేటాయింపుల నేపథ్యంలోనూ కంపెనీ ఈ స్థాయి లాభాన్ని అర్జించడం గమనార్హం. కాగా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.287 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం ఈ క్యూ2లో వార్షిక ప్రాతిపదికన 33 శాతం వృద్ధితో రూ.2,627 కోట్ల నుంచి రూ.3,515 కోట్లకు ఎగసింది. కేటాయింపులు వార్షికంగా 20 శాతం, క్వార్టర్‌ పరంగా 46 శాతం పెరుగుదలతో రూ.132 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఈ క్యూ2లో స్థూల ఎన్‌పీఏలు 0.93 శాతం నుంచి 0.96 శాతానికి ఎగశాయి. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్లు 3.44 శాతం నుంచి 3.15 శాతానికి తగ్గాయి. కంపెనీ నిర్వహణ ఆస్తులు సెప్టెంబర్‌ చివరి నాటికి రూ.1.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిల్లో వార్షికంగా 38 శాతం, క్వార్టర్‌ పరంగా 7.6 శాతం వృద్ధి నమోదయ్యింది. 

కాగా క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు ధర 4 శాతానికి పైగా పెరిగి రూ.234 వద్ద ముగిసింది. 



You may be interested

4 ఎన్‌బీఎఫ్‌సీలకు మోర్గన్‌ స్టాన్లీ బై రేటింగ్‌

Wednesday 21st November 2018

ముంబై: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంక్షోభం అనంతరం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగం గడిచిన రెండు నెలలుగా నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా హోల్‌సేల్‌ ఫండింగ్‌ లెండర్లలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈక్విటీ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెఎఫ్‌సీ) షేర్లు ఏకంగా 10-60 శాతం వరకు పడిపోయాయి. ఈ పరిస్థితికి కారణాలను

కొనసాగిన ఐటీ షేర్ల పతనం

Wednesday 21st November 2018

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బుధవారం రాత్రి రూపాయి ఫారెక్స్‌ మార్కెట్‌లో ముగిసే సమయానికి 21పైసలు బలపడి రెండు నెలల గరిష్ట స్థాయి 71.46 వద్ద ముగిసింది. నేడు ఈద్‌-ఈ-మిలద్‌ పండుగ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు. ఇప్పటికే వరుసగా ఆరు రోజుల పాటు ర్యాలీ చేసిన రూపాయి ఈ 6రోజుల్లో డాలర్‌ మారకంలో ఏకంగా 143 పైసలు బలపడింది. ఈ నవంబర్‌లో

Most from this category