STOCKS

News


రుణాల చెల్లింపులకై నిధులను కోరిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Sunday 11th August 2019
news_main1565541590.png-27692

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫైనాన్స్‌ సంస్థ, దివాన్‌ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) తన రిటైల్ కస్టమర్లకు, ప్రాజెక్ట్ డెవలపర్లకు చెల్లించడానికి వెంటనే బ్యాంకుల నుంచి రూ .15 వేల కోట్లు కోరిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా రిజల్యూషన్‌ను డ్రాఫ్ట్‌ ప్రణాళికను ఈ సంస్థ రుణదాతలకు సమర్పించింది. ‘తీవ్ర నగదు కొరత వలన ఆగిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు’ అని పరిశీలకులు తెలిపారు. కంపెనీ రిజల్యూషన్‌ ప్లాన్‌కు సంబంధించిన విషయాలను బీఎస్‌ఈ ఫైలింగ్‌లో  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పేర్కొంది. గత ఏడాది లిక్విడిటీ సమస్య వలన ఆగిపోయిన రిటైల్‌ ఫండింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఈ కంపెనీ బ్యాంకులు లేదా నేషనల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ఎన్‌హెచ్‌బీ) నుంచి ఫండ్స్‌ను కోరిందని రిజల్యూషన్‌ డ్రాఫ్ట్‌ ప్లాన్‌ ప్రకారం తెలుస్తోంది. కానీ అదనపు నిధులపై నిర్ణయం, రుణదాతల చర్చల తర్వాత మాత్రమే తీసుకోడానికి వీలు కలుగుతుంది. ఈ కంపెనీ జూన్‌ నెల నుంచి బాండ్‌ హోల్డర్ల చెల్లింపులను చేయడంలో విఫలమైంది. వివిధ బ్యాంకులు, ఎన్‌హెచ్‌బీ, ఇతర రుణదాతల నుంచి రూ.9,000 కోట్ల రుణాలను ఈ కంపెనీ తీసుకుంది.
    గత నెల జూన్‌ 7 నుంచి అమలులోకి వచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌  రిజల్యూషన్‌/రికగ్నిషన్‌ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఈ రుణదాతలు గత నెలలో ఇంటర్‌-క్రెడిటర్‌ ఒప్పందం(ఐసీఏ)పై సంతకం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కంపెనీ అగష్టు 8 వ తేదిన తన ఆర్థిక బాధ్యతలను సమీప భవిష్యత్‌లో కూడా తీర్చలేనని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘ఐసీఏపై సంతకం చేసిన రుణదాతలతో రిజల్యూషన్‌ ప్రణాళికపై కొనసాగుతున్న చర్చల దృష్ట్యా, సమీప భవిష్యత్తులో మా చెల్లింపు బాధ్యతలు వారి ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం నెరవేరలేవని అనుకుంటున్నాం’ అని కంపెనీ ఎక్చేంజిలకు తెలియజేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గత సెప్టెంబర్ నుంచి లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటోంది. అప్పటి నుంచి ఆస్తుల సెక్యూరిటైజేషన్, రుణ చెల్లింపుల వలన రూ .41,000 కోట్లను తిరిగి చెల్లించింది. జూన్ 4 న డీహెచ్‌ఎఫ్‌ఎల్ తన బాండ్-హోల్డర్లకు రూ. 1,150 కోట్లను డిఫాల్ట్ చేయడంతో, రూ .850 కోట్ల విలువైన వాణిజ్య పత్రాలను మూడు రేటింగ్ ఏజెన్సీలు 'డిఫాల్ట్'కు తగ్గించిన విషయం తెలిసిందే.



You may be interested

9 నెలల్లో రుణ రహితంగా ఇమామీ!

Sunday 11th August 2019

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ ఇమామీ వచ్చే 9 నెలల్లో రుణ భారాన్ని పూర్తిగా తొలగించుకోనుంది. ప్రస్తుతానికి కంపెనీ రుణ భారం రూ.2,600 కోట్లుగా ఉంది. గ్రూపు కంపెనీల రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన మార్గాలు ఉన్నాయని ఇమామీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ గోయంకా తెలిపారు. పర్సనల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులు, పేపర్‌, హాస్పిటల్స్‌, వంట నూనెలు, బయో డీజిల్‌, సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌ చైన్లు, విద్యుత్‌

మార్కెట్‌ విలువను పెంచిన 7 కంపెనీలు

Sunday 11th August 2019

అత్యంత విలువైన 10 భారతీయ కంపెనీలలో,  ఏడు కంపెనీలు కలిపి గత వారం మార్కెట్ వాల్యుయేషన్‌కు రూ .87,965.88 కోట్లును జోడించాయి. మార్కెట్‌ విలువను పెంచిన టాప్‌ కంపెనీలలో హెచ్‌యుఎల్(హిందుస్థాన్‌ యూనిలీవర్‌), హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్‌), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. కానీ ఆర్‌ఐఎల్‌(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌), ఐటీసీ, ఎస్‌బీఐ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌

Most from this category