STOCKS

News


హెచ్‌పీసీఎల్ ప్రమోటరు ఓఎన్‌జీసీనే!!

Friday 10th August 2018
news_main1533897732.png-19143

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు (హెచ్‌పీసీఎల్‌) కొత్త ప్రమోటర్ ఓఎన్‌జీసీనే అని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. హెచ్‌పీసీఎల్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది కనుక సహజంగానే ఓఎన్‌జీసీ ప్రమోటర్ అవుతుందని పేర్కొన్నారు. ఓఎన్‌జీసీని ప్రమోటింగ్ సంస్థగా గుర్తించడానికి హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా నిరాకరించిన నేపథ్యంలో ప్రధాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) సుమారు రూ. 36,915 కోట్లు వెచ్చించి హెచ్‌పీసీఎల్‌లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీలకు చేసిన ఫైలింగ్స్‌లో ఓఎన్‌జీసీని పబ్లిక్ షేర్‌హోల్డరుగాను, రాష్ట్రపతిని ప్రమోటర్‌గా పేర్కొనడం వివాదానికి దారి తీసింది. దీన్ని తక్షణమే సరిదిద్ది ప్రమోటరుగా తమ పేరును చేర్చాలంటూ ఓఎన్‌జీసీ కోరినప్పటికీ హెచ్‌పీసీఎల్ నిరాకరించింది.



You may be interested

రిటైల్ రుణాలపై జాగ్రత్త వహించాలి

Friday 10th August 2018

ముంబై: కార్పొరేట్ రుణాల్లో మొండిబాకీల భారం పెరిగిందనే ఉద్దేశంతో.. రిటైల్ రుణాలవైపు మళ్లుతున్న బ్యాంకర్లు జాగ్రత్త వహించాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి రిటైల్ రుణాలు మోక్ష మార్గం కాదని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. "రిటైల్ రుణాల్లో నిర్వాణ (మోక్షమార్గం) వెతుక్కుంటున్న ప్రతి బ్యాంకరు కొంత జాగ్రత్త

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనద్దు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి జేపీ గ్రూప్‌కు అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌పై  (జేఐఎల్‌) తాజాగా దివాలా ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఈ బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనవద్దని జేఐఎల్‌తోపాటు మాతృసం‍స్థ జేపీ గ్రూప్‌కు, ప్రమోటర్లకు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దివాలా చట్టం (ఐబీసీ) కింద జేఐఎల్‌ హోల్డింగ్‌

Most from this category