STOCKS

News


దేశీ విమానయాన సంస్థల సేఫ్టీ ఆడిట్‌ షురూ..

Friday 28th September 2018
news_main1538109826.png-20667

న్యూఢిల్లీ: దేశీ విమానప్రయాణాల్లో ఇటీవల పలు వివాదాస్పద ఉదంతాలు నమోదవుతున్న నేపథ్యంలో విమానాల్లో రక్షణ చర్యలపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే షెడ్యూల్డ్ విమానయాన సంస్థలన్నింటిపైనా ఆడిట్ జరుగుతోందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి ముంబై కేంద్రంగా పనిచేసే ఎయిర్‌లైన్స్ ఆడిట్ చేపట్టనున్నట్లు వివరించారు. విమానయాన సంస్థల కార్యకలాపాలతో పాటు శిక్షణా కార్యక్రమాలు.. కేంద్రాలు, సిబ్బంది పనితీరును కూడా మదింపు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది షెడ్యూల్డ్‌ ఆపరేటర్స్ ఉండగా .. ఎయిరి౾ండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్, విస్తార మొదలైనవి ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ప్రయాణం మధ్యలో ఇంజిన్లు ఫెయిల్‌ కావడం, విమానాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరులతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ ఆడిట్ ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

హైదరాబాద్‌లో మల్టిసోర్బ్‌ ప్లాంట్‌

Friday 28th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన మరో కంపెనీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కెమికల్, ఫార్మా రంగాల్లో అవసరమైన ఆక్సిజన్, తేమ ప్యాకేజింగ్‌ ఉత్పత్తులను తయారు చేసే మల్టిసోర్బ్‌.. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏవియేషన్‌ సెజ్‌ (జీహెచ్‌ఏఎస్‌ఎల్‌)లో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్లాంట్‌ నిర్మాణం, తయారీ యంత్రాలు ఇతరత్రా వాటి కోసం తొలి దశలో రూ.44 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. ప్రస్తుతం ఈ కేంద్రంలో 35

ఈ రెండు కంపెనీల్లో ఎంత ఇన్వెస్ట్‌ చేశారు ?

Friday 28th September 2018

న్యూఢిల్లీ:  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌... ఏ మేరకు ఇన్వెస్ట్‌ చేశాయో వెల్లడించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలను అడిగింది.లిక్విడిటీ భయాలు నెలకొన్న నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ను సెబీ ఈ వివరాలను కోరిందని సమాచారం. ఈ రెండు కంపెనీల్లో ప్రస్తుతమున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రోల్‌ఓవర్‌ చేయవద్దని సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సూచించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  రుణాల చెల్లింపుల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు విఫలమైన

Most from this category