STOCKS

News


జెట్‌ఎయిర్‌వేస్‌పై డీజీసీఏ డేగకన్ను

Thursday 20th December 2018
news_main1545284073.png-23105

న్యూఢిల్లీ: నిధుల సమస్యతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక పరిస్థితిని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నిశితంగా పరిశీలించనుంది. ఇకనుంచి ప్రతి పదిహేను రోజులకొకసారి సంస్థ ఆర్థిక స్థితిగతులను డీజీసీఏ పర్యవేక్షిస్తుందని సంబంధిత అధికారులు చెప్పారు. సీఏఆర్‌ (సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌)లోని నిబంధనల ఆధారంగా ఈ పరిశీలన జరపుతారు. ఇందులో భాగంగా విమానాల నిర్వహణ, సంస్థ నిర్వహణ తదితర అంశాలను కూడా డీజీసీఏ గమనించనుంది. గత ఆగస్టులో కంపెనీలో డీజీసీఏ ఫైనాన్షియల్‌ ఆడిట్‌ నిర్వహించింది. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా రక్షణాపరమైన అంశాల్లో సంస్థ రాజీ పడడంలేదని ధృవీకరించుకునేందుకు ఈ ఆడిట్‌ నిర్వహించడం జరిగింది. వరుసగా మూడు త్రైమాసికాల పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. దీంతో సంస్థ తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటోంది. ఇటీవలే కొందరు ఉద్యోగులకు, విమానాలు లీజుకు ఇచ్చిన వారికి పేమెంట్లు చెల్లించలేకపోయింది. ప్రస్తుతం సంస్థ నెత్తిన దాదాపు 8000 కోట్ల రూపాయల రుణభారం ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు నిధుల సమీకరణతో సహా పలు మార్గాలను కంపెనీ అన్వేషిస్తోంది. సంస్థకు సరైన విత్త సాయం అందించగల ఇన్వెస్టర్ల వేటలో ఉన్నామని గతనెల్లో సంస్థ సీఈఓ వినయ్‌ దూబే చెప్పారు. దీంతోపాటు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌, టాటా గ్రూప్‌తో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది. కంపెనీలో ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉంది. సంస్థకు ఎక్కువగా అప్పిచ్చిన ఎస్‌బీఐ ఇటీవలే కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఎర్నెస్ట్‌యంగ్‌ సంస్థతో ఫైనాన్షియల్‌ ఆడిట్‌ జరిపించింది. ఏప్రిల్‌ 2014 నుంచి మార్చి 2018 మధ్య ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎస్‌బీఐ ఈ ఆడిట్‌ను జరిపించింది. 
 You may be interested

మరింత సరళంగా ప్రత్యక్షపన్ను చట్టాలు

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: ఆదాయపన్ను చట్టాన్ని మరింత సరళంగా, ప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యేలా తీర్చిదిద్దేందుకు ఒక కొత్త ప్యానెల్‌ ఏర్పాటైంది. అనేక ఉదాహరణలు, నిబంధనలతో క్లిష్టంగా మారిన చట్టంలోని భాగాలపై ప్యానెల్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టనుందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. భారత ఆదాయపన్ను చట్టాన్ని 1961లో రూపొందించారు. ఇప్పటికీ చట్టంలోని పలు అంశాలు సామాన్యులకు కొరుకుడు పడని రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి మరింత విపులంగా ఐటీ చట్టాన్ని తీసుకుపోయేందుకు

ఆర్థిక వ్యవస్థకు ‘డైమండ్‌’ మెరుపు!!

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యేనాటికి ఆర్థికవ్యవస్థను మరింతగా ఉరకలెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశ జీడీపీని 9-10 శాతం చొప్పున పరుగులు పెట్టిస్తూ 2022-23 నాటికి ఎకానమీని 4 లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నీతిఆయోగ్‌ రూపొం‍దించింది. ‘‘స్ట్రాటజీ ఫర్‌ న్యూఇండియా@ 75’’ పేరిట ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. 2022 నాటికి భారత్‌ స్వాతంత్రం సాధించి

Most from this category