STOCKS

News


భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి

Saturday 20th April 2019
Markets_main1555738611.png-25240

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వెల్లడి

న్యూఢిల్లీ: షార్ట్‌ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించినప్పటికీ భారత్‌లో వచ్చే మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఆఖరుకి భారత్‌లోని ఉద్యోగుల సంఖ్యను కూడా 1,000కి పెంచుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నట్లు బైట్‌డ్యాన్స్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ విభాగం) హెలినా లెర్ష్‌ వెల్లడించారు. స్వల్ప నిడివి ఉండే వీడియోలను షేర్ చేసుకునేందుకు ఉపయోగపడే టిక్‌టాక్ యాప్‌ ద్వారా అశ్లీల వీడియోలు కూడా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో దీన్ని నిషేధించడం తెలిసిందే. దీంతో గూగుల్‌, యాపిల్ సంస్థలు టిక్‌టాక్‌ను తమ యాప్‌ స్టోర్స్‌ నుంచి తొలగించాయి. 



You may be interested

మే 3 నుంచి ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ

Saturday 20th April 2019

- మే 17న ముగింపు  - రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల 3న మొదలై 17న ముగుస్తుంది. ఈ రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.25,000 కోట్లు సమీకరించనున్నది. స్ల్పిట్‌ దరఖాస్తు ఫారాలను మే 10లోపు సమర్పించాలని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూకు అర్హులైన వాటాదారులను గుర్తించడానికి రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 24గా

రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం !

Saturday 20th April 2019

-శతృ ఆస్తుల విక్రయానికి కూడా  -కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సం‍స్థల స్థలాల విక్రయానికి రీట్స్‌ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృఆస్తుల విక్రయానికి కూడా రీట్స్‌(రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది.  రీట్స్‌ విధానంపై ఆర్థిక శాఖ చూపు... వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ

Most from this category