STOCKS

News


దేనా బ్యాంక్‌ నష్టాలు రూ.722 కోట్లు

Tuesday 7th August 2018
news_main1533619645.png-19002

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి.గత క్యూ1లో రూ.133 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.722 కోట్లకు పెరిగాయని దేనా బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ1లో రూ.2,620 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 8 శాతం తగ్గి రూ.2,410 కోట్లకు చేరిందని పేర్కొంది. వడ్డీ ఆదాయం రూ.2,383 కోట్ల నుంచి రూ.2,249 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 17.37 శాతం నుంచి 22.69 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 11.22 శాతం నుంచి 11.04 శాతానికి తగ్గాయని పేర్కొంది. కేటాయింపులు రూ.435 కోట్ల నుంచి రూ.1,244 కోట్లకు పెరిగాయని తెలిపింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో దేనా బ్యాంక్‌ షేర్‌ 1.8 శాతం లాభంతో రూ.16.55 వద్ద ముగిసింది. 



You may be interested

బ్రిటానియా లాభం రూ.258 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.258 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.216 కోట్లతో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,375 కోట్ల నుంచి రూ.2,586 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రీ తెలిపారు.  గత

ఎఫ్‌బీ, వాట్సాప్‌ బ్లాక్‌పై అభిప్రాయాలు చెప్పండి

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాలైన జాతీయ భద్రత, ప్రజా జీవనం ప్రమాదంలో పడినప్పుడు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ తరహా యాప్స్‌ను బ్లాక్‌ చేసేందుకు అనుసరించాల్సిన సాంకేతిక చర్యల విషయమై పరిశ్రమ అభిప్రాయాల్ని టెలికం శాఖ కోరింది. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొడైవర్ల అసోసియేషన్‌ (ఐఎస్‌పీఏఐ), సీవోఏఐలకు టెలికం శాఖ జూలై 18నే లేఖలు రాసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద మొబైల్‌ అప్లికేషన్లను బ్లాక్‌ చేయడంపై తమ

Most from this category