STOCKS

News


ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించండి

Monday 8th July 2019
news_main1562563057.png-26887

  • జీవీకేకు సూచించిన ఢిల్లీ హైకోర్టు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బిడ్‌ సర్వీసెస్‌ కేసులో మధ్యంతర ఉపశమనం కోసం ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించుకోవచ్చని జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తనకున్న 13.5 శాతం వాటాను థర్డ్‌ పార్టీకి విక్రయించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ బెంచ్‌ ఇటీవల బిడ్‌ సర్వీసెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జీవీకే కోర్టును ఆశ్రయించింది. ఆర్బిట్రేషన్‌ యాక్టు సెక్షన్‌ 9 కింద ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించుకోవచ్చని జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌, జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌ల డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు జీవీకేను సూచించింది. బిడ్‌ సర్వీసెస్‌-జీవీకే కేసు పెండింగులో ఉన్న సమయంలో ఇరు పార్టీలు ఆర్బిట్రేటార్లను నామినేట్‌ చేశాయి. ముగ్గురు సభ్యులతో ఇప్పటికే ఈ ట్రిబ్యునల్‌ ఏర్పాటై ఉంది. జూలై 9న ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ తొలిసారిగా సమావేశం కానుంది. ఆర్బిట్రల్‌ యాక్టు సెక్షన్‌ 17 ప్రకారం ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ ఇటువంటి దరఖాస్తులను స్వీకరించవచ్చని, జూలై 9నే వేగవంతమైన పరిష్కారం చూపవచ్చని న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



You may be interested

రిటైర్మెంట్‌ సమయానికి ఎంత అవసరం..?

Monday 8th July 2019

ఇందుకోసం ఎన్నో సూత్రీకరణలు 60 ఏళ్ల నాటికి జీవన వ్యయాలే కీలకం కనీసం వార్షిక ఖర్చులకు  28-30 రెట్లు అవసరం సంపాదన ఆరంభించిన నాటి నుంచే ప్రణాళిక అప్పుడే దీర్ఘకాలంలో తగినంత నిధి ఏర్పడుతుంది ఈ తరం వారికి రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ వచ్చే సదుపాయాలు ఉండడం లేదు. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్‌ ఉన్నా కానీ, అదేమంత సరిపోయే మొత్తం కాదు. ప్రభుత్వరంగంలోని వారిని మినహాయించి చూస్తే, మిగిలిన వారు ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత

నేడు ఆర్‌బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్‌ భేటీ

Monday 8th July 2019

బడ్జెట్‌లో చర్యలపై చర్చ... న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం(నేడు) రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్‌బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019-20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర

Most from this category