STOCKS

News


మిశ్రమంగా అటో అ‍మ్మకాలు

Monday 1st October 2018
Markets_main1538386490.png-20757

వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో  మిశ్రమంగా నమోదయ్యాయి. ప్యాసింజర్‌ వాహన విక్రయాలకు డిమాండ్‌ లేకపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, అటో పరిశ్రమపై కేరళ వరదల ప్రభావం ఇప్పటికీ తగ్గకపోవడం, దేశంలో పలు ప్రాంతాల్లో వర్షభావ ప్రభావం తక్కువగా నమోదుకావడం తదితర కారణాలు సెప్టెంబర్‌ వాహన విక్రయాలపై ప్రభావాన్ని చూపాయి. ఈ నెలలో (అక్టోబర్‌) పండుగ సీజన్‌ సందర్భంగా తిరిగి అటో విక్రయాలు పుంజుకుంటాయనే ఆశాభావాన్ని పలు కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.
మారుతి వేగం తగ్గింది.
సెప్టెంబర్‌లో మారుతి సుజుకీ అమ్మకాల వేగం తగ్గింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 1,62,290 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన 1,63,071 యూనిట్లతో పోలిస్తే ఇది 0.5శాతం తక్కువ. ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు సైతం 1.40శాతం తగ్గాయి. ఈ నెలలో మొత్తం 1,15,228 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగంలో 1,16,886 యూనిట్లను విక్రయించింది. ఎగుమతులు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ సెప్టెంబర్‌లో 8,740యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గతేడాది ఇదే నెలలో ఎగుమతి చేసిన 11,671 యూనిట్లతో పోలిస్తే ఇది 25.1శాతం తక్కువ. అయితే దేశీయంగా మాత్రం అమ్మకాలు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో మొత్తం 151400 యూనిట్లును విక్రయించగా,  ఈఏడాది 153550 యూనిట్లను అమ్మింది.
అంతంత మాత్రంగా ఎంఅండ్‌ఎం అమ్మకాలు:-
సెప్టెంబర్‌లో ఎంఅండ్‌ఎం అమ్మకాలు అంతంత మాత్రం‍గానే నమోదయ్యాయి. పాసింజర్‌ వాహనాల అమ్మకాలు 16శాతం పడిపోయాయి. గతేడాది ఇదే సెప్టెంబర్‌లో 25,414 యూనిట్లను విక్రయించగా, ఈ సెప్టెంబర్‌లో 21,411యూనిట్లను విక్రయించింది. ఈ నెలలో మొత్తం 55,022 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌లో విక్రయించిన 53,752 వాహనాలతో పోలిస్తే ఇది 2శాతం మాత్రమే అధికం. దేశీయ అమ్మకాలు 1శాతం మాత్రమే పెరిగాయి. ఈ నెలలో 51,268 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సెప్టెంబర్‌లో 50,545 వాహనాలను విక్రయించింది. వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 19శాతం పెరిగి 22,917యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు సైతం 17శాతం పెరిగి 3,754 యూనిట్లుగా నమోదయ్యాయి.
అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు అదిరాయి:-
హిందూజా గ్రూప్‌నకు చెందిన అశోక్‌లేలాండ్‌ సెప్టెంబర్‌ నెల‌లో 19,373 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన 15317 యూనిట్లతో పోలిస్తే ఇది 26శాతం అధికం. భారీ, మధ్య తరహా విభాగంలో మొత్తం విక్రయాలు 21శాతం పెరిగి 14323గా నమోదయ్యాయి. ఇదే విభాగంతో గతేడాది సంస్థ 11805 యూనిట్లను విక్రయించింది. తేలికపాటి వాహన విభాగంలో సైతం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ విభాగంలో సంస్థ అ‍మ్మకాలు 44శాతం వృద్ధితో 5,141 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఈ విక్రయాలు మొత్తం 3566 యూనిట్లుగా నమోదయ్యాయి.



You may be interested

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు సత్యం తరహా పరిష్కారం?

Monday 1st October 2018

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను ఒడ్డునపడేసేందుకు సత్యం కంప్యూటర్స్‌ తరహా పరిష్కారాన్ని తెచ్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గ్రూప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసేందుకు ఎన్‌సీఎల్‌టీని అనుమతి కోరింది. సోమవారమే ఇందుకు సంబంధించి ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయి. సంక్షోభానికి సరైన మేనేజ్‌మెంట్‌ చర్యలు లేకపోవడం కూడా ఒక కారణమని కేంద్రం తన పిటీషన్‌లో పేర్కొంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పతనమైతే అది అటు ఎంఎఫ్‌లు, ఇటు

ఇన్వెస్టర్ల సంపద హరించిన ఫండ్స్‌ ఇవే..

Monday 1st October 2018

సెప్టెంబర్‌లో చాలా వరకు ఈక్విటీ ఫండ్స్‌ నెట్‌ అసెట్‌ వ్యాల్యు (ఎన్‌ఏవీ) తగ్గిపోయింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, బాండ్‌ ఈల్ట్స్‌ పెరుగుదల, లిక్విడిటీ భయాల వల్ల గత నెలలో స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీ ఏకంగా 6 శాతానికిపైగా పతనమయ్యాయి. గత 31 నెలల కాలంలో ఈ స్థాయిలో ఇండెక్స్‌లు పడిపోవడం ఇదే ప్రథమం.   ► మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగాన్ని

Most from this category