STOCKS

News


దీపక్‌ కొచర్‌కు కార్పొరేట్‌ శాఖ సమన్లు?

Tuesday 11th September 2018
news_main1536642404.png-20155

న్యూఢిల్లీ: వీడీయోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వివాదంలో చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఈ నెలాఖరులో ప్రశ్నించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ కేసుతో సంబంధంపై ఆయన్ను ప్రశ్నించేందుకు గాను సమన్లు జారీ చేయనున్నట్టు చెప్పారు. వీడియోకాన్‌కు రుణం జారీ వెనుక, ఆమె భర్త దీపక్‌ కొచర్‌ ప్రమోటర్‌గా ఉన్న నూపవర్‌ కంపెనీలోకి పెట్టుబడులు తరలివెళ్లాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో సంబంధం ఉన్న నూపవర్‌ రెన్యువబుల్స్‌, నూపవర్‌ వైండ్‌ ఫార్మ్స్‌, సుప్రీం ఎనర్జీ, పసిఫిక్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, ఎచంద ఉర్జా కంపెనీల ఖాతాల తనిఖీకి కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఏప్రిల్‌ 23నే ఆదేశించింది. 



You may be interested

హార్లిక్స్‌ రేసులో కోక-కోలా

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: మాల్ట్‌ ఆధారిత హెల్త్‌ డ్రింక్‌ హార్లిక్స్‌ కొనుగోలు రేసులో తాజాగా కోక-కోలా కూడా చేరింది. గ్లాక్సో స్మిత్‌లైన్‌ (జీఎస్‌కే) కంపెనీ హార్లిక్స్‌ బ్రాండ్‌ను భారత్‌లో విక్రయానికి పెట్టింది. ఈ 145 ఏళ్ల బ్రాండ్‌ను 390 కోట్ల డాలర్లకు (300 కోట్ల పౌండ్లు)విక్రయించాలని జీఎస్‌కే యోచిస్తోందని ఇంగ్లాండ్‌కు చెందిన సండే టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. హార్లిక్స్‌ బ్రాండ్‌ను చేజిక్కించుకోవడానికి అంతర్జాతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థలు-నెస్లే, క్రాఫ్ట్‌ హీంజ్‌ తదితర సంస్థలు పోటీపడుతున్నాయి.

ఆస్ట్రేలియా ఓపెన్‌తో ఇన్ఫీ జట్టు

Tuesday 11th September 2018

బెంగళూరు: సాంకేతిక ఆవిష్కరణలో భాగంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. మూడేళ్లు కొనసాగే ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరహా సేవలందించడానికి అవకాశం లభించినట్లుగా భావిస్తున్నామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్ పరేఖ్ అన్నారు. ‘డిజిటల్‌ టెక్నాలజీ హద్దులను దాటుకుని ఎంత వరకు వెళ్లగలదనే అంశాన్ని టోర్నమెంట్‌లో ప్రదర్శించాలని అనుకుంటున్నాం. టోర్నీ చూసే విధానంలో మార్పులు తేవాలని

Most from this category