STOCKS

News


ఆదాయంపై భరోసా ఇస్తేనే ఆర్థిక సాయం..

Friday 22nd February 2019
news_main1550827497.png-24282

- బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు తేల్చి చెప్పిన డీసీసీ న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన సహాయం పొందాలంటే సరైన టర్న్‌ అరౌండ్ వ్యూహాన్ని సమర్పించాలని, ఆదాయ వృద్ధిపై భరోసానివ్వాలని ప్రభుత్వ రంగ టెల్కోలు బీఎస్‌ఎన్ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) స్పష్టం చేసింది. "ఆర్థిక సహాయం గానీ అందజేస్తే... ఈ రెండు కంపెనీలూ మళ్లీ ఎప్పటికల్లా లాభాల్లోకి వస్తాయి? అందుకోసం ఏయే వ్యూహాలు అమలు చేయాలనుకుంటున్నాయి? వంటి వివరాలు చెప్పాలని డీసీసీ సభ్యులు అడిగారు" అని గురువారం డీసీసీ సమావేశం అనంతరం సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యకలాపాలను చక్కదిద్దుకునేందుకు ఆర్థిక సహాయం, ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) అమలు, 4జీ స్పెక్ట్రం, అసెట్స్‌ విక్రయానికి అనుమతులు ఇవ్వాలంటూ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ చర్యలతో దాదాపు రూ. 19,000 కోట్ల రుణభారం నుంచి బైటపడొచ్చని ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే కార్యకలాపాలు ఉన్న ఎంటీఎన్‌ఎల్‌ భావిస్తోంది. వీఆర్‌ఎస్ అమలు కోసం 10 ఏళ్ల బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని రెండు సంస్థలకు టెలికం శాఖ సూచించింది. స్థిరాస్తుల లీజు ద్వారా వచ్చే నిధులను బాండ్ల చెల్లింపునకు వినియోగించుకోవాలని పేర్కొంది. 



You may be interested

అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌

Friday 22nd February 2019

దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులు సూచీల ర్యాలీని రెండురోజులకే పరిమితం చేశాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు అక్కడిక్కడే ముగిశాయి. సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 35,871 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 10,792 వద్ద స్థిరపడ్డాయి. అమెరికాలో ఆర్థిక గణాంకాలు బలహీన నమోదు కావడంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ ప్రతికూల ప్రభావం ప్రపంచమార్కెట్లను వెంటాడింది.

డేటా వినియోగానికి 4జీ ఊతం

Friday 22nd February 2019

- 2018లో 109 శాతం వృద్ధి - నోకియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: 4జీ టెక్నాలజీ రాకతో దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఏకంగా 109 శాతం మేర వృద్ధి చెందింది. దేశీయంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌కి (ఎంబీఐటీ) సంబంధించి నోకియా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి నెలకు ప్రతి యూజరు వినియోగించే డేటా పరిమాణం సగటున 10 గిగాబైట్స్ (జీబీ)

Most from this category