STOCKS

News


డీసీబీ బ్యాంక్‌ లాభం 50 శాతం అప్‌

Friday 19th April 2019
news_main1555652956.png-25222

- 14 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం 
- ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ డీసీబీ బ్యాంక్‌ నికర లాభం 50 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.96 కోట్ల నికర లాభం సాధించామని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) నాలుగో త్రైమాసికంలో రూ.64 కోట్ల నికర లాభం వచ్చిందని డీసీబీ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మురళి ఎమ్‌. నటరాజన్‌ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.349 కోట్ల నుంచి 15 శాతం ఎగసి రూ.400 కోట్లకు చేరిందన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.14 శాతం వృద్ధితో రూ.301 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 17 శాతం పెరిగి రూ.99 కోట్లకు చేరింది. కేటాయింపులు రూ.40 కోట్ల నుంచి రూ.35 కోట్లకు తగ్గాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను (10 శాతం) ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
మిశ్రమంగా మొండి బకాయిలు...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.245 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 33 శాతం వృద్ధితో రూ.325 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.1,306 కోట్ల నుంచి రూ.1,499 కోట్లకు చేరుకుంది. గత ఏడాది మార్చి నాటికి 1.79 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 1.84 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 0,72 శాతం నుంచి 0.65 శాతానికి తగ్గాయి. 
సమతూక వృద్ధి సాధనే లక్ష్యం...
సమతూక వృద్ధి సాధించడం తమ లక్ష్యమని నటరాజన్‌ తెలిపారు. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌, ఆదాయ-వ్యయ తదితర నిష్పత్తుల్లో నిలకడైన మెరుగుదల సాధించడంపై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ఉత్పాదకత పెంచుకోవడం, మూలధన వినియోగం అంశాల్లో మెరుగుదల సాధించే ప్రయత్నాల్లో విజయం సాధించామని తెలిపారు.



You may be interested

నిమిషానికో ఫోన్‌ విక్రయిస్తున్నాం

Friday 19th April 2019

కొత్తగా 150- 200 స్టోర్లు ఏర్పాటు చేస్తాం హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ హ్యాపీ మొబైల్స్‌... సగటున నిముషానికి ఒక స్మార్ట్‌ఫోన్‌ చొప్పున విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 స్టోర్లతో 5 లక్షల మందికిపైగా కస్టమర్లకు చేరువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 150- 200 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ

స్పైస్‌జెట్‌లోకి మరో ఆరు బోయింగ్ 737ఎస్‌ విమానాలు

Friday 19th April 2019

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌.. త్వరలోనే మరో ఆరు బోయింగ్ 737ఎస్‌ విమానాలను తన సేవల్లోకి జోడించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇందుకోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌కు ఎటువంటి అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ (ఎన్ఓసీ) కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపింది. ఈ నూతన లీజింగ్‌ విమానాల ద్వారా ముంబై-ఢిల్లీ రూట్‌లో 24 నూతన సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మరో విమానయాన సంస్థ

Most from this category