News


51 శాతం పెరిగిన డీసీబీ బ్యాంక్‌ లాభం

Thursday 17th January 2019
news_main1547701861.png-23634

- మొత్తం ఆదాయం 27 శాతం అప్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ డీసీబీ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 51 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.57 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లకు ఎగసిందని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు జోరుగా పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని వివరించింది.  మొత్తం ఆదాయం రూ.686 కోట్ల నుంచి రూ.872 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 1.89 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 0.89 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయని బ్యాంకు తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ.294 కోట్లకు, రుణాలు రూ.18,595 కోట్ల నుంచి 23 శాతం వృద్ధితో రూ.22,888 కోట్లకు పెరిగాయి. కేటాయింపులు 17 శాతం పెరిగి రూ.40 కోట్లకు చేరాయని, నికర వడ్డీ మార్జిన్‌ 4.12 శాతం నుంచి 3.83 శాతానికి తగ్గిందని తెలిపింది.



You may be interested

తగ్గిన పసిడి

Thursday 17th January 2019

గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణతో గురువారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సైతం పసిడికి ప్రతికూలాంశంగా మారింది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 5డాలర్ల వరకు నష్టపోయింది. ఉదయం గం.10:45ని.లకు పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,291.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌ సమస్యతో ఐరోపాలో, ప్రభుత్వం షట్‌డౌన్‌ అంశంతో అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఫెడ్‌ రిజర్వ్‌

మైండ్‌ ట్రీ లాభం 35 శాతం అప్‌

Thursday 17th January 2019

30 శాతం పెరిగిన ఆదాయం ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 35 శాతం  పెరిగింది. గత క్యూ3లో రూ.142 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.191 కోట్లకు పెరిగిందని మైండ్‌ ట్రీ తెలిపింది.ఆదాయం రూ.1,378 కోట్ల నుంచి 30 శాతం ఎగసి రూ.1,787 కోట్లకు చేరిందని కంపెనీ

Most from this category