STOCKS

News


డీసీబీ బ్యాంక్‌ లాభం రూ.73 కోట్లు

Thursday 18th October 2018
news_main1539834813.png-21263

ముం‍బై: ప్రైవేట్‌ రంగంలోని డీసీబీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.73 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.59 కోట్ల నికర లాభం వచ్చిందని, 25 శాతం వృద్ధిని సాధించామని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ2లో రూ.652 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.809 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మురళీ ఎమ్‌. నటరాజన్‌ తెలిపారు.  స్థూల మొండి బకాయిలు 1.8 శాతం నుంచి 1.84 శాతానికి పెరిగాయని, కానీ  నికర మొండి బకాయిలు 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గాయని తెలిపారు. 

రిటైల్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ/ఎస్‌ఎమ్‌ఈ, వ్యవసాయ విభాగాలు  మంచి వృద్ధిని సాధించాయని నటరాజన్‌ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ పద్ధతులు మంచి ఫలితాలనిచ్చాయని తెలిపారు. మొండి బకాయిలు నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు. వృద్ధిని సాధిస్తూనే, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ మెరుగుపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డీసీబీ బ్యాంక్‌ షేర్‌ 4.6 శాతం క్షీణించి రూ.160 వద్ద ముగిసింది. 



You may be interested

మార్కెట్‌కు సెలవు

Thursday 18th October 2018

దసరా సందర్భంగా నేడు (గురువారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. కాగా బుధవారం నాడు స్టాక్‌ మార్కెట్‌ లాభాలు మూడు రోజుల ముచ్చటే అయింది. డాలర్‌తో రూపాయి మారకం ఒడిదుడుకులకు గురికావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు​చూపారు. దీంతో బుధవారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్ల

రూ. 7,500 కోట్లు చెల్లిస్తాం

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్‌ కొనుగోలు బిడ్డింగ్‌కు అర్హత పొందే దిశగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు చెల్లించాల్సిన రూ.7,469 కోట్లు చెల్లించేందుకు సిద్ధమని ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్ తెలిపింది. భారత మార్కెట్లో స్థానం దక్కించుకునేందుకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు మంచి అవకాశం కాగలదని పేర్కొంది. ఎస్సార్‌ స్టీల్ కొనుగోలు కోసం ఆర్సెలర్‌మిట్టల్‌, న్యూమెటల్ సంస్థలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొండిపద్దులుగా మారిన ఉత్తమ్‌ గాల్వా, కేఎస్‌ఎస్

Most from this category