STOCKS

News


సైయంట్‌ లాభం రూ. 188 కోట్లు

Friday 26th April 2019
news_main1556252977.png-25356

  • రెవెన్యూలో 9.5 శాతం వృద్ధి
  • 2018-19 సంవత్సరానికి రూ. 15 డివిడెండ్‌

న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో సైయంట్‌ నికరలాభం 54.7 శాతం పెరిగి రూ. 188.1 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 121.5 కోట్ల లాభం నమోదు చేసింది. ‘వన్‌ ఆఫ్‌ ఎంప్లాయి’ కార్యక్రమం, ఇన్‌సైట్స్‌ సంస్థ మూసివేత ప్రభావం లేకుండా లెక్కిస్తే క్యు4లో నికరలాభం 176.8 కోట్లని కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ 9.5 శాతం వృద్ధితో రూ. 1,162.9 కోట్లకు చేరింది. క్యు3తో పోలిస్తే లాభం రెట్టింపు కాగా, రెవెన్యూలో 2.1 శాతం క్షీణత నమోదయింది.మొత్తం 2018-19 ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 14 శాతం పెరిగి రూ. 489.8 కోట్లను చేరింది. ఇదే సమయానికి రెవెన్యూ 17.9 శాతం పెరుగుదలతో 4,617.5 కోట్ల రూపాయలను చేరిందని కంపెనీ ప్రకటించింది. అదనపు అంశాలను మినహాయించి లెక్కిస్తే ఏడాది మొత్తానికి నికరలాభంలో 18 శాతం పెరుగుదల నమోదయినట్లు తెలిపింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ ఆల్‌టైమ్‌ హై వార్షిక రెవెన్యూ 66కోట్ల డాలర్లను సాధించింది.  రెవెన్యూలో డాలర్‌లెక్కల్లో 8.7 శాతం, స్థిర కరెన్సీ లెక్కలో 10.1 శాతం వృద్ది నమోదయింది. 2018-19 సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ. 9 రూపాయల అంతిమ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. మార్చి చివరి నాటికి కంపెనీ వద్ద రూ. 998.3 కోట్ల నగదు నిల్వలున్నాయని తెలిపింది. గతంలో ప్రకటించిన రూ. 200 కోట్ల బైబ్యాక్‌లో భాగంగా మార్చి చివరి నాటికి 26 లక్షల షేర్లను రూ. 167 కోట్లతో కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం చివరకు కంపెనీలో 15,084మంది ఉద్యోగులున్నారు. వాలంటరీ ఆట్రిషన్‌ రేట్‌ 19.9 శాతం, ఇన్‌వాలంటరీ ఆట్రిషన్‌ రేటు 4.6 శాతంగా నమోదయినట్లు తెలిపింది. 
కొత్త ఏడాదిపై భరోసా
క్యు4లో రెవెన్యూ, మార్జిన్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయామని కంపెనీ ఎండీ, సీఈఓ కృష్ణ బోదనపు చెప్పారు. కానీ ఏడాది మొత్తంగా చూస్తే బలమైన ప్రదర్శన చూపామన్నారు. కొత్త ఉత్పత్తులు, స్థిరమైన ఆర్డర్‌బుక్‌ కారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంపై బలమైన అంచనాలున్నాయని, రెండంకెల ఎబిటా వృద్ది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2018-19లో ఆన్సెమ్‌ ఎన్‌వీ సంస్థను సొంతం చేసుకున్నామని, సైయంట్‌ ఇన్‌సైట్స్‌లో వాటాను 100 శాతానికి పెంచుకున్నామని చెప్పారు. దీంతో పాటు సైయంట్‌ డీఎల్‌ఎంలో అదనంగా మరో 26 శాతం వాటా సొంతం చేసుకున్నామన్నారు. ఈ కొత్త కొనుగోళ్లు సంస్థ మరింత ముందుకు దూసుకుపోయేందుకు సహకరిస్తాయని ఆశాభావం వక్తం చేశారు. అంతిమ డివిడెండ్‌ రూ.9తో కలిపి గత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ. 15 డివిడెండ్‌ ప్రకటించామని కంపెనీ సీఎఫ్‌ఓ అజయ్‌ అగర్వాల్‌ తెలిపారు. సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా 67 సైయంట్‌ డిజిటల్‌ సెంటర్లతో 27వేలకుపైగా పిల్లలకు సాంకేతిక సాయం అందించామన్నారు.You may be interested

స్టార్టప్‌లకు పన్ను మినహాయింపులు

Friday 26th April 2019

- వాణిజ్య శాఖ ప్రతిపాదనలు న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేలా అంకుర సంస్థలకు పన్నులపరమైన మినహాయింపులతో పాటు పలు ప్రోత్సాహకాలివ్వాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వాణిజ్య శాఖలో భాగమైన.. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) 'స్టార్టప్ ఇండియా విజన్ 2024' పేరుతో ప్రత్యేక పత్రాన్ని రూపొందించింది. 2024 నాటికి కొత్తగా 50,000 స్టార్టప్స్ ఏర్పాటుకు తోడ్పాటునివ్వడం, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి

టాటా స్టీల్‌ లాభం రూ.2,295 కోట్లు

Friday 26th April 2019

ఒక్కో షేర్‌కు రూ.13 డివిడెండ్‌  -కంపెనీలో టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌ విలీనం  న్యూఢిల్లీ: దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ నికర లాభం(కన్సాలిడేడెట్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 84 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.14,688 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,295 కోట్లకు తగ్గిందని టాటా స్టీల్‌ తెలిపింది. 2017-18 క్యూ4లో బ్రిటిష్‌

Most from this category