STOCKS

News


ఎస్‌బీఐ జనరల్ నుంచి సైబర్ బీమా పాలసీ

Tuesday 23rd April 2019
news_main1555995904.png-25285

న్యూఢిల్లీ: సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం మొదలైన వాటి నుంచి వ్యాపార సంస్థలకు రక్షణనిచ్చేలా ప్రత్యేకంగా బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ప్రారంభ దశలో చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి పెడతామని, ఆ తర్వాత పెద్ద కార్పొరేట్ సంస్థలకు కూడా అందించనున్నామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అన్ని రకాలు, పరిమాణాల వ్యాపార సంస్థలకు సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిందని, ఈ నేపథ్యంలోనే వాటి కారణంగా వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసేందుకు అనువుగా ఈ పాలసీని రూపొందించడం జరిగిందని ఎస్‌బీఐ జనరల్ తెలిపింది. 



You may be interested

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి హైదరాబాద్‌ కంపెనీ?

Tuesday 23rd April 2019

1.5 బిలియన్‌ డాలర్లతో మైత్రా ఎనర్జీ కొనుగోలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ మైత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్‌ డాలర్ల డీల్‌తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్‌ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. ప్రస్తుతం మైత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,

లైవ్‌ క్లాస్‌లతో కాసుల వర్షం

Tuesday 23rd April 2019

- దేశీయంగా ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ల జోరు - ఆన్‌లైన్‌లో పోటీపరీక్షలు, పాఠ్యాంశాల బోధనపై దృష్టి - లిస్టులో బైజూస్, అన్‌ అకాడెమీ తదితర సంస్థలు న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీంతో లైవ్‌ తరగతులు నిర్వహించే పలు ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థల ఆదాయం భారీగా పెరుగుతోంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ రూపొందించిన నివేదిక ప్రకారం... ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఫీజులు చెల్లించి

Most from this category