STOCKS

News


బ్యాంకింగ్ మోసాలపై సీవీసీ అధ్యయనం

Wednesday 17th October 2018
news_main1539750011.png-21221

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో టాప్‌ 100 బ్యాంకింగ్‌ మోసాలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) అధ్యయనం చేసింది. మోసాలు జరుగుతున్న తీరు, రుణ పరిమాణం, లోటుపాట్లు తదితర అంశాలను విశ్లేషించింది. వ్యవస్థలో లోపాలు సరిదిద్దేందుకు తీసుకోతగిన చర్యలు సిఫార్సు చేసింది. సీవీసీ ఈ తరహా అధ్యయనం నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ నివేదికను రిజర్వ్‌ బ్యాంక్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ తదితర నియంత్రణ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు అందించినట్లు విజిలెన్స్‌ కమిషనర్‌ టీఎం భాసిన్‌ తెలిపారు. 2017 మార్చి 31 నుంచి వజ్రాభరణాలు, తయారీ, ఆగ్రో, మీడియా, ఏవియేషన్‌ తదితర 13 రంగాల సంస్థలు వివిధ రూపాల్లో తీసుకున్న రుణాల తీరుతెన్నులను అధ్యయనం చేసినట్లు ఆయన వివరించారు. మోసాల జరిగే తీరు గురించి క్షేత్ర స్థాయి సిబ్బందిలో అవగాహన పెంచేందుకు, ఫ్రాడ్స్‌ పునరావృతం కాకుండా నివారించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. మోసాలు చోటుచేసుకునే తీరును సోదాహరణంగా వివరిస్తూ.. వజ్రాభరణాల పరిశ్రమలో అధిక రుణాలు పొందే ఉద్దేశంతో చాలా మటుకు ప్రైవేట్‌ కంపెనీలు వజ్రాల విలువను అధికంగా చూపుతుంటాయని భాసి¯ తెలిపారు. బ్యాంకులు తమ రుణాల మంజూరు కార్యకలాపాలను పెంచుకునే క్రమంలో వజ్రాభరణాల రంగానికి స్వల్పకాలంలోనే భారీగా రుణాలిచ్చేశాయన్నారు. ఇలాంటి రుణాలిచ్చేటప్పుడు సెగ్మెంట్‌ వారీగా కొన్ని పరిమితులు ఉంటే శ్రేయస్కరమని ఆయన చెప్పారు.
     



You may be interested

అత్యుత్తమ కంపెనీ... ‘ఎల్‌ అండ్‌ టీ’

Wednesday 17th October 2018

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,000 ‘బెస్ట్‌ గ్లోబల్‌ ఎంప్లాయర్స్‌’ కంపెనీల జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించగా... దేశీ మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. 2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో మొత్తం 4,30,000 కంపెనీలను పరిశీలించిన ఫోర్బ్స్.. వీటిలో అత్యంత ఉత్తమమైన ఎంప్లాయర్స్‌గా 2వేల కంపెనీలను ఎంపికచేసింది. ఈ జాబితాలో వందలోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీలలో ఎల్ అండ్

సందీప్‌ భక్షి నియామకాన్ని ఆమోదించిన ఆర్‌బీఐ

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓ ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పదవికి ప్రతిపాదిత సందీప్‌ భక్షి నియామకాన్ని ఆమోదించింది. అయితే, బ్యాంకు బోర్డ్‌ ప్రతిపాదించిన 5 ఏళ్ల పదవీకాలాన్ని పక్కన పెట్టి.. వచ్చే మూడేళ్లు ఈయన బ్యాంకు ఎండీ, సీఈఓగా కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 15 (సోమవారం) నుంచి

Most from this category