STOCKS

News


బ్యాంకుల్లో మోసాల నివారణకు సీవీసీ చర్యలు

Thursday 27th December 2018
Markets_main1545884234.png-23255

ఆడిట్‌ నివేదికల తనిఖీ
దిద్దుబాటు చర్యల సూచన

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీల్లో మోసాల నివారణకు కేంద్ర స్థాయిలో అవినీతి నిరోధక సంస్థ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) రంగంలోకి దిగింది. ఆయా సంస్థల ఆడిట్‌ నివేదికలను తనిఖీ చేయడంతోపాటు మోసాల నివారణకు దిద్దుబాటు చర్యలను కూడా సూచించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తున మోసాల ఘటనలను రిపోర్ట్‌ చేస్తుండడం, మొండి బకాయిలు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో సీవీసీ ఈ చర్యలు తీసుకుంటుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సెంట్రల్‌ స్టాట్యుటరీ రిపోర్ట్‌లు, ఇతర ఆడిటర్‌ రిపోర్ట్‌లను ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీల్లోని చీఫ్‌ విజిలెన్స్‌ అధికారుల ద్వారా సమీక్షిస్తున్నామని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ టీఎం భాసిన్‌ తెలిపారు. ఆడిట్‌ నివేదికలను కమిషన్‌ స్థాయిలో పరిశీలించి, దిద్దుబాటు చర్యలను కూడా సూచిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగంలోని వివిధ బ్యాంకులు 2015-16, 2017-18 మధ్య కాలంలో పెద్ద ఎత్తున మోసాల కేసులను నమోదు చేశాయి. 2017-18లో మొత్తం 8,802 మోసాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో చోటు చేసుకోగా, 2016-17లో 7,794 కేసులు, 2015-16లో 7,482 మోసాలు జరిగినట్టు స్వయంగా కేంద్ర మంత్రి లోక్‌ సభకు తెలిపారు. ఈ తరహా మోసాలను ముందుగానే గుర్తించడంపై దృష్టి సారించాలని, రిస్క్‌ నిర్వహణపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో సీవీసీ బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద 100 మోసాలపై విశ్లేషణను కూడా పూర్తి చేసింది. తాను గుర్తించిన అంశాలను ఆర్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐలతో పంచుకోవడం గమనార్హం.



You may be interested

పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు

Thursday 27th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్‌ సీఈఓ, ఎండీ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు దక్కింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును అందుకున్నారు. పల్సస్‌ సంస్థ... ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా  హెల్త్‌ కేర్‌ రంగానికి సంబంధించి ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది. విదేశాలతో పాటు

భారత్‌ ఎగుమతులు బాగున్నాయి

Thursday 27th December 2018

 అయితే పూర్తి సంతృప్తి లేదు  - వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్‌ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా

Most from this category