News


సీఎస్‌ఆర్‌ దీర్ఘకాలిక వ్యూహంగా ఉండాలి

Wednesday 19th December 2018
news_main1545193609.png-23060

న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాల (సీఎస్‌ఆర్‌)ను కంపెనీలు తాత్కాలికమైనవిగా భావించకుండా.. దీర్ఘకాల వ్యూహంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి పి.పి.చౌదరి సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించేందుకు కూడా సీఎస్‌ఆర్ కార్యకలాపాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన జాతీయ సీఎస్‌ఆర్ సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీల చట్టం 2013 కింద లాభదాయక కంపెనీలు తమ మూడేళ్ల సగటు నికర లాభాల్లో కనీసం రెండు శాతం మొత్తాన్ని సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. వైద్యం, పేదరిక నిర్మూలన, పౌష్టికాహార లోపాలను సరిదిద్దడం తదితర అంశాలపై 2015-16లో కంపెనీలు సీఎస్‌ఆర్ కింద సుమారు రూ. 4,330 కోట్లు వ్యయం చేసినట్లు ఆయన మంత్రి పేర్కొన్నారు. 



You may be interested

క్యాప్‌జెమిని చైర్మన్‌గా శ్రీనివాస్ కందుల

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ క్యాప్‌జెమిని.. భారత కార్యకలాపాలకు చైర్మన్‌గా శ్రీనివాస్ కందులను నియమించింది. ఇంతకుముందు శ్రీనివాస్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈఓ) సంస్థకు సేవలంచారు. తాజాగా ఆయన స్థానంలో సీఓఓ అశ్విన్ యార్డీని నియమించినట్లు క్యాప్‌ జెమిని ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్రాండ్‌ను మెరుగుపరచటం, కీలక వాటాదారులతో సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం వంటి బాధ్యతలను ఇక నుంచి శ్రీనివాస్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. మానవ

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 19th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- కంపెనీలో యస్‌ బ్యాంక్‌  వివిధ విడతల్లో​ 2.13శాతం వాటాను విక్రయించింది. జే కుమార్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- ఎన్‌హెచ్‌ఏఐ నుంచి రూ.1,349 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. వెల్‌స్పాన్‌ ఎంటర్‌ప్రైజెర్‌:- భోపాల్‌ దివాస్‌ కారిడర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 13శాతం వాటాను రూ.57.7కోట్లకు విక్రయించింది. ఈ అమ్మకంతో భోపాల్‌ దివాస్‌ కారిడర్‌ ప్రైవేట్‌ మొత్తం 50శాతం వాటాను ఉపసంహరించుకున్నట్లైంది. పుష్పక్‌:- బ్యాంకు సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని రేటింగ్‌

Most from this category