STOCKS

News


చమురు మంట తగ్గినా... గృహోపకరణాలు చల్లారలేదు

Wednesday 5th December 2018
news_main1543985927.png-22652

న్యూఢిల్లీ: చమురు ధరలు శాంతించాయి... డాలర్‌తో రూపాయి కొంచెం బలం పుంజుకుంది. అయినా, గృహోపకరణాల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇటీవలి కాలంలో బ్యారెల్‌కు 80 డాలర్ల వరకు వెళ్లి తిరిగి 60 డాలర్ల లోపునకు పడిపోగా... డాలర్‌తో 74కు పైగా దిగజారిన రూపాయి తిరిగి 71 లోపునకు వచ్చేసింది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపకరణాల తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అవి ధరల్ని పెంచటం మొదలెట్టాయి. కానీ, రూపాయి రివకరీతో వినియోగదారులకు లాభించిందేమీ లేదు. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రెండో విడత ధరల పెంపును నిలిపివేసినప్పటకీ, గృహోపకరణాల తయారీ సంస్థలు మాత్రం ధరల్ని పెంచుతూనే ఉన్నాయి. దీనికి కారణం అధిక కస్టమ్స్‌ డ్యూటీయేనని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. రూపాయి డాలర్‌తో 67-68 స్థాయి పైనే ఉందని, తమ తయారీ వ్యయాలన్నీ గతంలో ఈ స్థాయి ఆధారంగానే అంచనా వేసినవని వారు చెబుతున్నారు. దీంతో తమ మార్జిన్లపై ఒత్తిడి ఉందంటున్నారు. ‘‘దిగుమతి చేసుకునే ఖరీదైన ఉత్పత్తుల ఎంఆర్‌పీలను 7- 10 శాతం మధ్యలో పెంచడం జరిగింది. మధ్య స్థాయి ఉత్పత్తులపై ఈ పెంపు 4-5 శాతం మధ్యనే ఉంది’’ అని హేయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రజంగ తెలిపారు. మరోవైపు శామ్‌సంగ్‌, ఎల్‌జీ కంపెనీలు రానున్న వారాల్లో ధరల పెంపును అమలు చేయనున్నట్లు తెలిసింది. వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్‌లు తదితర ఉత్పత్తలపై 3-5 శాతం మేర పెంపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 
ఏసీలపై త్వరలోనే బాదుడు
ఇక ఏసీ తయారీ కంపెనీలు 2019 సీజన్‌కు ముందు తయారయ్యే నూతన స్టాక్‌పై వచ్చే నెలలో రేట్లు పెంచొచ్చని అంచనా. దిగుమతి చేసుకునే వాటి ధరలు పెరగడమే దీనికి కారణం. దేశీయ ఏసీ పరిశ్రమలో 30 శాతం దిగుమతి ఆధారితంగా తయారయ్యేవేనని ఎడెల్వీజ్‌ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లతో పోలిస్తే ఏసీల్లో ఎ‍క్కువ విడి భాగాలు దిగుమతుల ద్వారానే వస్తున్నాయి. చైనా, థాయిలాండ్‌, తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ నుంచి ఇవి దిగుమతవుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లపై (10 కిలోల కంటే తక్కువ లోడ్‌) బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం మేర కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో పెంచింది. దీంతో ఈ ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ 20 శాతానికి చేరింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెషర్లపై కస్టమ్స్‌ సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. ప్రభుత్వం నిర్ణయం తర్వాత చాలా వరకు కంపెనీలు ఉత్పత్తులపై రేట్లను పెంచాయి. అయితే, ఆ వెంటనే పండుగలు ఉండడంతో ధరల పెంపును మాత్రం వెంటనే అమలు చేయలేదు. ఆ పెంపును ఇప్పుడు అమల్లో పెడుతున్నట్టు గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌నంది తెలిపారు. పండుగల సందర్భంగా వ్యాపారులకిచ్చిన తగ్గింపులు, సబ్సిడీలను కూడా ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. రూపాయి మారకం విలువలో ఆటుపోట్ల కారణంగా గత ఏడాది కాలంలో కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ కంపెనీలు ఉత్పత్తుల ధరలను మూడు సార్లు పెంచాయి. గతేడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో మూడు సార్లు కస్టమ్స్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది.



You may be interested

చివరి త్రైమాసికంలో జీడీపీ పుంజుకుంటుంది: నీతి ఆయోగ్‌

Wednesday 5th December 2018

గువహటి: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) వేగంగా పుంజుకుంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. దీంతో 2018-19 సంవత్సరానికి వేసిన అంచనాలను జీడీపీ వృద్ధి రేటు చేరుతుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో నమోదైన 8.2 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. గత

ఇథియోపియాలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అధికారుల అరెస్టు

Wednesday 5th December 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా సంస్థ ఐఎల్‌౾అండ్‌ఎఫ్‌ఎస్ సిబ్బందిని కష్టాలు వెన్నాడుతున్నాయి. సిబ్బందికి జీతభత్యాలు, ప్రభుత్వానికి పన్నుల చెల్లించటం లేదన్న ఆరోపణలపై కంపెనీకి చెందిన ముగ్గురు భారతీయ అధికారులను ఇథియోపియా పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్న ఆరోపణలపై గత నెల.. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థ ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌ (ఐటీఎన్‌ఎల్‌) అధికారులు ఏడుగురిని ఒరోమియా, అమ్హారా రాష్ట్రాల్లోని సిబ్బంది బంధించిన సంగతి తెలిసిందే.

Most from this category