STOCKS

News


క్రిసిల్‌ లాభం రూ.77 కోట్లు

Wednesday 18th July 2018
news_main1531890435.png-18423

ముంబై: ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.77 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.67 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని క్రిసిల్‌ తెలిపింది. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.436 కోట్లకు, ఇతర ఆదాయం దాదాపు రెట్టింపై రూ.17 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అషు సుయాశ్‌ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. దేశీయ కంపెనీల బాండ్ల జారీ బాగా తగ్గినప్పటికీ తమ కీలక వ్యాపారం రేటింగ్స్‌ విభాగం మంచి వృద్ధినే సాధించిందని వివరించారు. వ్యయ నియంత్రణ పద్దతుల కారణంగా మార్జిన్‌లు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో క్రిసిల్‌  షేర్‌  0.4 శాతం లాభంతో రూ.1,766 వద్ద ముగిసింది. 



You may be interested

ఎగవేతదారులు దేశం నుంచి పారిపోకుండా చూడ్డం ఎలా?

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ బడా రుణ ఎగవేతదారులు, ప్రమోటర్లు దేశం వదిలి పారిపోకుండా నిరోధించడం ఎలా అన్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో సవరణలు, సూచనలు ఇవ్వడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తారు.  దేశీయ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల విషయంలో భారత్‌ కాకుండా ఏ ఇతర దేశంలో పౌరసత్వం ఉంది?

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లాభం రెట్టింపు

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రెట్టింపైంది. గత క్యూ1లో రూ. 42 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.91 కోట్లకు పెరిగిందని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,204 కోట్ల నుంచి రూ.3,153 కోట్లకు పెరిగిందని జేఎస్‌ఎల్‌ ఎమ్‌డీ అభ్యుదయ్‌ జిందాల్‌ చెప్పారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మార్కెట్‌ జోరు కారణంగా అమ్మకాలు 51 శాతం

Most from this category