STOCKS

News


క్రెడిట్‌ యాక్సెస్‌ ఐపీవో... కంపెనీ బలాబలాలు

Wednesday 8th August 2018
news_main1533666866.png-19024

బెంగళూరు కేంద్రంగా నడిచే సూక్ష్మ రుణాల వ్యాపార సంస్థ ‘క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌’ ఐపీవో ఈ నెల 8న ప్రారంభం కానుంది. ఆగస్ట్‌ 10న ముగిసే ఈ ఐపీవోకు ఒక్కో షేరు ధరల శ్రేణిగా రూ.418-422ను కంపెనీ ఖరారు చేసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ అవుతుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, క్రెడిట్‌ సూసే సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహింద్రా క్యాపిటల్‌ కంపెనీలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఈ ఐపీవోకు దరఖాస్తు చేయాలనుకునే ఔత్సాహికులు ముందుగా కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. 

 

కంపెనీ ప్రొఫైల్‌
క్రెడెట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ అన్నది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సూక్ష్మ రుణాలను అందిస్తుంటుంది. జాయింట్‌ లయబిలిటీ గ్రూపు (రుణం తిరిగి చెల్లించే బాధ్యత) కింద ఓ బృందానికి రుణాలను మంజూరు చేస్తుంటుంది. స్థూల రుణ పోర్ట్‌ఫోలియో పరంగా దేశంలో మూడో అతిపెద్ద మైక్రో ఫైనాన్స్‌ సంస్థ అని క్రిసిల్‌ రీసెర్చ్‌ తెలిపింది. 2018 మార్చి నాటికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, కేరళ, గోవా రాష్ట్రాల్లో, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 516 శాఖలను కలిగి ఉంది. 18.5లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. పరిశ్రమలో అధిక కస్టమర్‌ రిటెన్షన్‌ (కంపెనీతోనే కొనసాగే రేటు) రేటు 90 శాతం ఈ కంపెనీ సొంతమని క్రిసిల్‌ తెలిపింది. కంపెనీ ప్రమోటర్‌ సంస్థ క్రెడిట్‌ యాక్సెస్‌ ఏషియా ఎన్‌వీ. మైక్రో ఫైనాన్స్‌లో బహుళజాతి సంస్థ ఇది. భారత్‌తోపాటు వియత్నా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో మైక్రో ఫైనాన్స్‌ కార్యకలాపాలను కలిగి ఉంది. క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌లో 98.88 శాతం వాటా ప్రస్తుతం కలిగి ఉంది.

 

పబ్లిక్‌ ఇష్యూ
ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.630 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తుండగా, అదే సమయంలో 1,18,76,485 షేర్లను ప్రమోటర్‌ సంస్థ క్రెడిట్‌ యాక్సెస్‌ ఏషియా ఎన్‌వీ విక్రయించనుంది. కనీస లాట్‌ సైజు 35 షేర్లు. రూ.1,131 కోట్ల వరకు నిధులను సమీకరించనుంది. తాజాగా రూ.630 కోట్ల మేర షేర్ల విక్రయం ద్వారా కంపెనీ తన భవిష్యత్‌ మూలధన అవసరాలను చేరుకోనుంది.

 

కంపెనీ బలాలు

 • కస్టమర్‌ కేంద్రంగా అన్న వ్యాపార నమూనాను పాటిస్తుండడంతో ప్రస్తుత కస్టమర్లను అధిక శాతం నిలబెట్టుకోవడంతోపాటు, కొత్త కస్టమర్లను ఆకర్షించే స్థితిలో ఉంది. 
 • గ్రామీణ ప్రాంతాల్లో బలంగా విస్తరించే ప్రణాళికతో ప్రయోజనాలు పొందనుంది.
 • కస్టమర్ల ఎంపిక, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను బలంగా ఉన్నాయి. దీంతో ఆస్తుల నాణ్యత ఆరోగ్యంగా ఉండడంతోపాటు, రుణ వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండనున్నాయి.
 • ఆర్థిక పనితీరు, నిర్వహణ సామర్థ్యం విషయంలో బలమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 
 • వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో నడిచే కంపెనీ. ఆర్థిక సేవల రంగంలో నిరూపితమైన ట్రాక్‌ రికార్డు ఉంది. కీలక యాజమాన్య నిపుణులు అందరూ ఎనిమిదేళ్లకు పైగా ఈ రంగంలో అనుభవజ్ఞులే. 
 • ఇంకా ఆర్థిక సేవలు అందని గ్రామీణ ప్రాంతాలపైనే ఫోకస్‌ చేసింది. తద్వారా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చన్న ప్రణాళికతో కంపెనీ ఉంది.
 • ప్రస్తుతమున్న రాష్ట్రాల్లోనూ మరింత విస్తరణపై దృష్టి పెట్టింది. అలాగే, పొరుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనుంది.

 

రిస్క్‌లు, ఆలోచించాల్సినవి

 • కార్యకలాపాలు ఎక్కువగా కర్ణాటక, మహరాష్ట్రలోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఏవైనా ఊహించని ప్రతికూలతలు చోటు చేసుకుంటే ఆ ప్రభావం కంపెనీపై పడొచ్చు.
 • సూక్ష్మ రుణాలు అన్‌సెక్యూర్డ్‌. కనుక క్రెడిట్‌ పరంగా ఎన్‌పీఏల రిస్క్‌ ఉంటుంది.
 • కంపెనీ రుణాల మంజూరు, కలెక్షన్లు అన్నీ నగదు రూపంలో జరుగుతుండడంతో మోసం, అవకతవకలకు అవకాశం ఉంటుంది. 
 • బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్ల నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 • డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్‌ సొల్యూషన్లు, ఫిన్‌టెక్‌ కంపెనీలు పెరుగుతున్న తరుణంలో ఈ సంస్థ వ్యాపారంపై ప్రభావం ఉండొచ్చు.
 • వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రుణ క్రమశిక్షణ గాడితప్పొచ్చు.You may be interested

నేటి మార్కెట్‌పై ప్రభావిత అంశాలు

Wednesday 8th August 2018

మార్కెట్లు మంగళవారం గరిష్ట స్థాయిల్లో ప్రాంభమయ్యాయి. అయితే చివరకు ఫ్లాట్‌గానే ముగిశాయి. దీని కన్నా ముందు ఇంట్రాడేలో ఒకానొక సమయంలో కొత్త గరిష్ట స్థాయిలను తాకింది. నిఫ్టీ ఇండెక్స్‌.. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పర్చింది. అందువల్ల ముగింపు స్థాయి..  ప్రారంభ స్థాయి కన్నా తక్కువగా ఉంది.  సెన్సెక్స్‌ 26 పాయింట్ల నష్టంతో 37,666 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతంమేర పడిపోయింది. సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి.  నిఫ్టీ

క్రికెట్‌ మాదిరి ఇన్వె‍స్ట్‌మెంట్‌ ప్రణాళిక

Tuesday 7th August 2018

ఇన్వెస్టర్లకు సమయం చాలా కీలకమైనదిగా ప్రముఖ ఇన్వెస్టర్‌, కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. క్రికెట్‌లో మాదిరి వ్యూహాలను పెట్టుబడులకు అనుసరించాల్సి ఉంటుందంటూ, క్రికెట్‌ ఫార్మాట్‌ను బట్టి గేమ్‌ ప్లాన్‌ మార్చుకున్నట్టే... ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల కాల వ్యవధులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా నడుచుకోవాలన్నది ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.   ఉదాహరణకు టెస్ట్‌మ్యాచ్‌ అనేది ఐదు రోజుల

Most from this category