సీపీఎస్‌యూ ఈటీఎఫ్‌కు రూ.27,300 కోట్ల బిడ్లు
By Sakshi

న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 5.5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ కేటాగిరీ ఇన్వెస్ట్రర్ల నుంచి రూ.13,300 కోట్లకు బిడ్లు వచ్చాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ.17,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ప్రావిడెండ్ ఫండ్ సంస్థ, ఈపీఎఫ్ఓ రూ.1,500 కోట్లకు బిడ్ దాఖలు చేసింది.
సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా దరఖాస్తులు వస్తే, మరో 6,000 కోట్లు అట్టేపెట్టుకోవాలని, మొత్తం రూ.14,000 కోట్లు సమీకరించాలని భావించింది. రూ.27,000 కోట్లకు బిడ్లు రావటంతో... రూ.17,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో 11 కంపెనీల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఎస్‌జేవీఎన్, ఎన్ఎల్సీ, ఎన్‌బీసీసీల షేర్లు ఈ ఈటీఎఫ్‌లో ఉన్నాయి.
You may be interested
మాల్యా కేసులో బ్యాంకులకు కొంత ఊరట
Saturday 1st December 2018లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా నుంచి బాకీలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశీ బ్యాంకులకు బ్రిటన్ హైకోర్టు కొంత ఊరటనిచ్చింది. మాల్యా విహార నౌక వేలం ద్వారా వచ్చిన నిధుల్లో ఎంతో కొంత బ్యాంకులకు కూడా దఖలుపడేలా ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెడితే.. మాల్యాకు మాల్టా ద్వీప దేశంలో 'ఇండియన్ ఎంప్రెస్' అనే విహార నౌక ఉండేది. దీన్ని నిర్వహించే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించకపోవడంతో బకాయిలు రాబట్టుకునేందుకు మారిటైమ్
భారత ఇంధన అవసరాలకు మరింత సహకారం
Saturday 1st December 2018న్యూఢిల్లీ: భారత్ తన ఇంధన అవసరాలను అధిగమించేందుకు అవసరమైతే మరింతగా పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తామని సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్నేహ హస్తం ప్రకటించారు. ఈ మేరకు సౌదీ మీడియా కథనాలను ప్రచురించింది. అర్జెంటీనియా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్లో జి-20 సదస్సు సందర్భంగా సల్మాన్ నివాసంలో ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. రాజకీయ, భద్రత, ఆర్థికం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇంధన, సాంస్కృతిక, టెక్నాలజీ