STOCKS

News


ఏప్రిల్‌ నుంచి డిజిన్వెస్ట్‌మెంట్‌

Tuesday 5th February 2019
news_main1549346635.png-24018

  • ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
  • 24 కంపెనీల్లో వాటాల అమ్మకం
  • ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌, బీఈఎంఎల్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ (బీఈఎంఎల్‌) సహా రెండు డజన్ల కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. ఇందులో తొమ్మిది కంపెనీల్లో వాటా విక్రయానికి ముందే వీటికి సంబంధించిన భూములు, ఇతర ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. వీటిల్లో స్కూటర్స్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా, భారత్‌ పంప్స్‌ అండ్‌ కంప్రెషర్స్‌, ప్రాజెక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా, హిందుస్తాన్‌ ప్రీఫ్యాబ్‌, హిందుస్తాన్‌ న్యూస్‌ప్రింట్‌, బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ కంపెనీ, హిందుస్తాన్‌ ఫ్లోరోకార్బన్స్‌ ఉన్నాయి. ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన కార్యాచరణను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) ఇప్పటికే రూపొందించింది. ‘‘ఆస్తుల నగదీకరణ కార్యాచరణ అన్నది... ఆస్తులను నిర్వచించడం, భిన్న మార్గాల్లో ఏ ప్రక్రియను అనుసరించేది తెలియజేస్తుంది’’ అని దీపమ్‌ సెక్రటరీ అతను చక్రవర్తి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ.80,000 కోట్ల సమీకరణ లక్ష్యం పెట్టుకోగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.90,000 కోట్లుగా ఇటీవలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పేర్కొన్న విషయం గమనార్హం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆస్తుల అమ్మకం కూడా ఓ భాగం.You may be interested

రెనో క్విడ్‌ @ రూ.2.67 లక్షలు

Tuesday 5th February 2019

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ ఆటో దిగ్గజం రెనో..  తన ఎంట్రీ లెవల్‌ కారు ‘క్విడ్’ను మరిన్ని భద్రతా ఫీచర్లతో సోమవారం భారత మార్కెట్లో  ప్రవేశపెట్టింది. ఈ నూతన వేరియంట్‌ ధరల శ్రేణి రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షలుగా ప్రకటించింది. కొత్త క్విడ్‌.. 0.8 లీటర్, 1 లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప‍్షన్లలో అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్‌

అనిల్‌ పని అయిపోయిందా..?

Tuesday 5th February 2019

అడాగ్‌ గ్రూప్‌ షేర్ల కకావికలం లక్షల కోట్ల వేల్యుయేషన్స్‌ ఆవిరి కీలకమైన ఆర్‌కామ్‌ దివాలా భారీ రుణభారంలో మిగతా గ్రూప్‌ సంస్థలు సినిమా, డిఫెన్స్‌, ఫైనాన్స్‌... అన్నిటిదీ అదేదారి షేర్‌హోల్డర్లకు భారీ నష్టాలు అన్న ముకేశ్‌తో పోలిస్తే 5 శాతం కూడా లేదు! అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్‌ అంబానీతో

Most from this category