STOCKS

News


రుణభారం తగ్గించుకోవడంపై కంట్రీక్లబ్ దృష్టి

Friday 16th November 2018
news_main1542349510.png-22071

ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్‌ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌, కర్ణాటకలోని సర్జాపూర్‌ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్‌ (సీసీహెచ్‌హెచ్‌ఎల్‌) చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి వెల్లడించారు. వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్‌మెంట్ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140 కోట్ల దాకా లభించగలవని ఆయన చెప్పారు. చెన్నైలోని జేడ్ రిసార్ట్స్‌ విక్రయానికి సంబంధించి చర్చలు తుదిదశలో ఉన్నాయన్నారు. ‘‘ఇపుడు సంవత్సరానికి రూ.40 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. తాజా డీల్స్‌తో కొంత రుణాలు తీర్చేస్తాం. దీంతో వడ్డీ భారం గణణీయంగా తగ్గుతుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ కింద రూ. 5 కోట్లు పొందాం. త్వరలో మరో రూ.25 కోట్లు అందుకుంటాం’’ అని వివరించారు. ప్రాపర్టీల డెవలప్‌మెంట్ ప్రక్రియ 30 నెలల్లోగా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా తమ రుణభారం రూ. 275 కోట్లని, రూ.1,500 కోట్ల మేర ఆస్తులున్నాయని చెప్పారాయన. వచ్చే 2-3 సంవత్సరాల్లో 50-60 శాతం పైగా తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు రాజీవ్ రెడ్డి చెప్పారు. మిలీయనీర్ కార్డ్స్ వంటి కొత్త ఉత్పత్తులు, వ్యయాల తగ్గింపు చర్యలతో ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయాలు 25 శాతం మేర వృద్ధి చెందగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. You may be interested

ధనుక అగ్రిటెక్‌ లాభం రూ.55 కోట్లు

Friday 16th November 2018

సెప్టెంబరు క్వార్టరులో ధనుక అగ్రిటెక్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 4.2 శాతం పెరిగి రూ.55 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.10.4 శాతం పెరిగి రూ.383 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.596 కోట్ల టర్నోవరుపై రూ.71 కోట్ల నికరలాభం నమోదైంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.550 మించకుండా బైబ్యాక్‌ చేయాలని కంపెనీ నిర్ణయించింది.

రెండో రోజూ జెట్‌ ఎయిర్‌వేస్‌ ర్యాలీ

Friday 16th November 2018

టాటా సన్స్‌ కంపెనీ టేకోవర్‌ వార్తల నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ షేర్ల ర్యాలీ రెండో రోజూ కొనసాగుతోంది. నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లోనూ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మరో 11శాతం ర్యాలీ చేసింది. తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను టాటా గ్రూప్‌ కొనుగోలుకు మొగ్గుచూపుతుందనే వార్తల నేపథ్యంలో క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 25శాతం లాభంతో రూ.321 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసుకునేందుకు టాటా

Most from this category