News


కార్పొరేషన్‌ బ్యాంక్‌ లాభం రూ.103 కోట్లు

Wednesday 14th November 2018
news_main1542173817.png-21982

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.103 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,035 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కార్పొరేషన్‌ బ్యాంక్‌ తెలిపింది. అయితే గత క్యూ2లో రూ.5,345 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,217 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నిర్వహణ లాభం రూ.1,163 కోట్ల నుంచి 23 శాతం తగ్గి రూ.899 కోట్లకు పరిమితమయింది. 
పెరిగిన మొండి బకాయిలు...
ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా అధ్వానమైంది. గత క్యూ2లో రూ.20,685 కోట్లుగా ఉన్న  స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.21,714 కోట్లకు పెరిగాయి. ఇక నికర మొండి బకాయిలు రూ.13,083 కోట్ల నుంచి రూ.13,534 కోట్లకు చేరాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 15.28 శాతం నుంచి 17.46 శాతానికి, నికర మొండి బకాయిలు 10.24 శాతం నుంచి 11.65 శాతానికి పెరిగాయి.  అయితే మొండి బకాయిలు పెరిగినా కేటాయింపులు తగ్గాయని కంపెనీ తెలియజేసింది. గత క్యూ2లో రూ.2,669 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.808 కోట్లకు తగ్గాయి. ఈ కేటాయింపుల్లో మొండి బకాయిలకు సంబంధించిన కేటాయింపులు ఈ క్యూ2లో రూ.729 కోట్లని, గత క్యూ2లో ఇవి రూ.2,536 కోట్లని వివరించింది. ఈ క్యూలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,555 కోట్ల మూలధన నిధులు లభించాయని, వీటికి సరిపడా షేర్లను గత నెల 11న కేటాయించామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కార్పొరేషన్‌ బ్యాంక్‌ షేర్‌ 1 శాతం లాభంతో రూ.27.40 వద్ద ముగిసింది. 

 



You may be interested

ఫ్లిప్‌కార్ట్ బిన్నీ రాజీనామా!!

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: 'తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన' ఆరోపణల కారణంగా దేశీ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ మంగళవారం గ్రూప్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవలే కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి స్వతంత్రంగా విచారణ జరిపామని, కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను ధృవీకరించడానికి తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అయినప్పటికీ విచారణ అనంతరం బన్సల్ వైదొలగాలని

సన్‌ఫార్మాకు రూ.219 కోట్ల నష్టం

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఊహించని విధంగా ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.219 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాలను ప్రకటించింది. అమెరికాలో మోడఫినిల్‌ యాంటీ ట్రస్ట్‌ కేసు పరిష్కారం కోసం రూ.1,214 కోట్లను కేటాయించడంతో లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ కేసులో ప్రత్యర్థి పార్టీలకు చెల్లించాల్సిన మొత్తాన్ని అంచనా వేసి ఈ మేరకు పక్కన పెట్టినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ కేసులో కొన్ని పార్టీలతో ఇప్పటికే సన్‌ఫార్మా ఒప్పందం కూడా చేసుకుంది. విశ్లేషకులు

Most from this category